Begin typing your search above and press return to search.

నెపోలియన్ అదృష్టం ఏమిటో?

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:30 PM GMT
నెపోలియన్ అదృష్టం ఏమిటో?
X
టాలీవుడ్ ఏడాదికి లెక్కలేనన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ అందులో సగానికిపైగా ఎప్పుడు వచ్చి పోతున్నాయో ఎవరికీ తెలియదు. కానీ ఆ సినిమాల్లో చాలా వరకు కొంత కంటెంట్ తో ఉన్న సినిమాలే అయినా తారాగణం లోపం వల్లనో ప్రమోషన్స్ చేయకపోవడం వల్లనో గాని మొత్తానికి సక్సెస్ కాకుండానే కనుమరుగైపోతున్నాయి. అందుకు వారి దగ్గర అనేక కారణాలు ఉండవచ్చు. కానీ సినిమా ఎంత మంచిగా తీసినా జనాల వరకు వెళ్లకపోతే ఏం లాభం.

అయిత్ రీసెంట్ గా అదే తరహాలో ఓ సినిమా కంటెంట్ చాలా కొత్తగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది సినిమా కూడా పూర్తయ్యి చాలా కాలమే అవుతోంది. ఒక యువకుడు తన నీడ పోయింది అని పోలీసులకు చెప్పడం.. తదితర పరిణామాలు చూస్తే.. ట్రైలర్ బాగానే అనిపించింది. కానీ మార్కెట్ లేకపోవడంతో సినిమా పరిస్థితి కొంచెం కష్టకాలంలోనే ఉంది. దానికి కారణం.. ఈ సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు. పైగా దర్శకుడే ఇందులో హీరో. ఇప్పుడదే మైనస్ అయ్యేలా ుంది.

ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నెపోలియన్ అనే సినిమా ఈ నెల 24న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఆనంద్ రవి ఇంతకుముందు ప్రతినిధి అనే సినిమాకు రైటర్ గా వర్క్ చేశాడు. ఈ కథ కొంచెం పెద్ద స్టార్స్ తో తీసి ఉంటె బావుండేదేమో.. ఇక ఈ వరం రెండు మూడు సినిమాలు కొంచెం ఊపు మీద ఉన్నాయి, మరి మనోడు ఏమైనా మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి.