Begin typing your search above and press return to search.

టీజర్ టాక్:మెల్లగా దోచేసారే

By:  Tupaki Desk   |   14 July 2018 5:57 AM GMT
టీజర్ టాక్:మెల్లగా దోచేసారే
X
ఇటీవలే సమ్మోహనంతో కూల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో సుధీర్ బాబు ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నిర్మించిన నన్ను దోచుకుందువటే టీజర్ విడుదలైంది. డెబ్యూ డైరెక్టర్ గా ఆర్ఎస్ నాయుడు దీని ద్వారా పరిచయమవుతున్నాడు. కథ చాలా సింపుల్ గా చూచాయగా ఇందులో చెప్పేసారు. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్ వేర్ కంపనీ మేనేజర్ గా సుధీర్ సీరియస్ లుక్స్ లో కనిపిస్తుండగా బాగా అల్లరి చేసే గడుసు అమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేష్ నటిస్తోంది. ఇది తన మొదటి సినిమా. సరదాగా జాలీగా అనిపిస్తున్న కాన్సెప్ట్ లో మరీ కొత్తదనం అని చెప్పలేం కాని ప్రెజెంటేషన్ లో ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన నన్ను దోచుకుందువటే టైటిల్ కూడా అలనాటి గులేబకావళి కథలో ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ సాంగ్ లైన్ ని పెట్టడం మంచి ఫీల్ కలిగొస్తోంది. సిరి నేను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని అంటూ నభా పదే పదే చెప్పుకోవడం మంచి ఫన్ క్రియేట్ చేసేలా ఉంది.

అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీకి సురేష్ రగుటు ఛాయాగ్రహణం అందించాడు. భిన్న ధృవాల్లాంటి ఎమోషన్స్ కలిగిన ఇద్దరు ప్రేమికుల మధ్య కథగా కనిపిస్తున్న ఈ నన్ను దోచుకుందువటే సుధీర్ బాబు గత సినిమా సమ్మోహనం తరహాలో ఫ్యామిలీ అండ్ యూత్ ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. స్వంత బ్యానర్ లో సుధీర్ చేస్తున్న మొదటి సినిమా ఇది. రిజర్వ్ గా ఎక్కువగా మాట్లాడని కార్తిక్ పాత్రలో సుధీర్ - మాటలు తప్ప మౌనంగా ఉండటం తెలియని సిరి పాత్రలో నభాల మధ్య దర్శకుడు మంచి బాండింగ్ రాబట్టినట్టు ఉన్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ ని వరుస బెట్టి చేస్తున్న సుధీర్ కు ఈ నన్ను దోచుకుందువటే కూడా అదే ఖాతాలో వెళ్ళేలా కనిపిస్తోంది.