Begin typing your search above and press return to search.

జపాన్‌ కు ప్రేమతో అంటున్న ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   11 Feb 2016 4:41 AM GMT
జపాన్‌ కు ప్రేమతో అంటున్న ఎన్టీఆర్
X
జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ భారీ కలెక్షన్లు రాబట్టే సత్తా ఉంది. అయితే ఈ నందమూరి హీరోకి జపాన్ లో కూడా బోలెడంత ఫాలోయింగ్ ఉందనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. గతంలో కూడా బాద్షా మూవీ ఇక్కడ భారీ ఎత్తున రిలీజ్ అయ్యి ఇరగదీసి ఆడేసింది కూడా. అంతే కాదు స్థానికంగా ఇచ్చే కొన్ని అవార్డులకు కూడా బాద్ షా సెలక్ట్ అయిందంటే.. జపాన్ లో జూనియర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతుంది.

అందుకే ఇప్పుడు యంగ్ టైగర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను.. ఇప్పుడు జపాన్ లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మొదట నాన్నకు ప్రేమతో తెలుగు చిత్రానికి జపనీస్ సబ్ టైటిల్స్ తో విడుదల చేయనున్నారు. స్థానిక డిస్ట్రిబ్యూటర్ - ఇండియన్ పనోరమా మూవీ పార్ట్నర్ అయిన ఇండోయీగా కలిసి ఈ సబ్ టైటిల్ వెర్షన్ ని సిద్ధం చేశాయి. ఈ వెర్షన్ వచ్చే వారం విడుదల కానుండగా.. త్వరలో డబ్బింగ్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేయనున్నారు.

గతేడాది భారీ చిత్రాలైన అఖిల్ - రుద్రమదేవి - బ్రూస్ లీ - శ్రీమంతుడు కూడా ఇక్కడ సబ్ టైటిల్ వెర్షన్స్ విడుదల అయ్యాయి. అయితే బాహుబలి మాత్రం ఇంకా ఇక్కడ రిలీజ్ కాలేదు. కారణం రైట్స్ కోసం రేట్ విషయంలో తేడా రావడమే. త్వరలో బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ ని కూడా ఇక్కడ విడుదల చేయనున్నారు.