Begin typing your search above and press return to search.

కృష్ణగాడి దర్శకుడితో మళ్ళీ లోకల్ హీరో

By:  Tupaki Desk   |   23 Feb 2017 5:01 PM GMT
కృష్ణగాడి దర్శకుడితో మళ్ళీ లోకల్ హీరో
X
హీరో నాని కొడుతున్న వరుస హిట్స్ ఇండస్ట్రీ జనాలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎవడే సుబ్రమణ్యంతో మొదలుపెట్టి ఇప్పటివరకూ అపజయం అనేది లేకుండా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్. రీసెంట్ గా నేను లోకల్ తో తన కెరీర్ బిగ్గెస్ట్ కూడా తీసేసిన నాని.. తన మరుసటి చిత్రాన్ని ఇప్పుడు అమెరికాలో చక్కబెట్టేస్తున్నాడు.

ఇవాళ ఈ నేచురల్ స్టార్ బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అందాల రాక్షసి అంటూ ఇండస్ట్రీలోకి వచ్చి.. నానితో కృష్ణగాడి వీర ప్రేమగాధ అంటూ సక్సెస్ సాధించిన దర్శకుడు హను రాఘవపూడి. ఇప్పుడీ దర్శకుడు మళ్లీ నానితో జట్టు కట్టబోతున్నట్లు ప్రకటించాడు హను. 'నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ ను.. నాని పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాం. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది' అని చెప్పారు నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి.. సుధాకర్ చెరువూరి.

జెంటిల్మన్ తర్వాత మరోసారి ఈ ప్రాజెక్టు ద్వారా సీనియర్ కంపోజర్ మణిశర్మ.. నానితో సినిమా చేయనున్నాడు. అలాగే కృష్ణగాడి వీరప్రేమగాధకు వర్క్ చేసిన యువరాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫీ అందించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/