Begin typing your search above and press return to search.

నరేష్ కోసం నాని!

By:  Tupaki Desk   |   28 July 2015 10:03 AM GMT
నరేష్  కోసం నాని!
X
ద‌ర్శ‌కుడైనా, హీరో అయినా... ఒక‌రు చేసిన సినిమాకి మ‌రొక‌రు సాయం చేసుకోవ‌డం మామూలే. ఆమ‌ధ్య సుకుమార్ తీసిన `1` (నేనొక్క‌డినే) సినిమాని చూసి రాజ‌మౌళి స్పందించాడు. సుకుమార్‌తో క‌లిసి ఇంట‌ర్వ్యూ ల్లో పాల్గొన్నాడు. అది సినిమా ప్ర‌మోష‌న్‌ కి బాగా ఉప‌యోగ‌ప‌డింది. క‌థానాయ‌కులు సైతం ఇలా ఒక‌రికొక‌రు త‌ర‌చుగా మాట సాయం చేసుకొంటుంటారు. వాళ్లు స్నేహితులైతే మ‌రీనూ. ట్విట్ట‌ర్‌ లోనూ, ఫేస్‌ బుక్కు లోనూ సినిమా గురించి పాజిటివ్‌ గా వ్యాఖ్య‌లు చేస్తూ `మీరూ చూడండి` అని అభిమానుల‌కు పిలుపునిస్తుంటారు. ఆ ప్ర‌య‌త్నం హెల్తీ అట్మాస్ఫియ‌ర్‌ కి అద్దం ప‌ట్టేలా ఉంటుంది.

తాజాగా విడుద‌లైన అల్ల‌రి న‌రేష్ `జేమ్స్‌ బాండ్` ప్ర‌మోష‌న్ కోసం మ‌రో క‌థానాయ‌కుడు నాని ముందుకొచ్చి ఓ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన్నాడు. అల్ల‌రి న‌రేష్‌, నాని మంచి స్నేహితులు. ఒక‌రినొక‌రు ఒరేయ్‌, ఒరేయ్ అని పిలుచుకొంటుంటారు. ఎవ‌రి సినిమా విడుద‌లైనా ట్విట్ట‌ర్లో ఆ సినిమాని ప్ర‌స్తావిస్తూ విషెస్ చెప్పుకొంటుంటారు. అందుకే `జేమ్స్‌ బాండ్‌` ప్ర‌మోష‌న్ కోసం న‌రేష్‌ని ఇంట‌ర్వ్యూ చేశాడు నాని. న‌రేష్‌ ని ఇంట‌ర్వ్యూ చేయాల‌ని నానికి ఎప్ప‌ట్నుంచో కోరిక ఉంద‌ట‌. అయితే న‌రేష్ 50వ సినిమాకి చేస్తే కాస్త క్రేజీ గా ఉంటుంద‌ని ఆయ‌న భావించాడ‌ట‌.

అయితే `జేమ్స్‌ బాండ్‌` బాగుంద‌నిపించ‌డంతో మంచి విష‌యాన్ని వాయిదా వేయ‌డం ఎందుక‌ని నాని ఇప్పుడే ఇంట‌ర్వ్యూ చేశాడ‌ట‌. ఆ విషయాన్ని ఆయ‌నే చెప్పుకొచ్చాడు. అన్న‌ట్టు `జేమ్స్‌ బాండ్‌`లో న‌రేష్ క్యారెక్ట‌ర్ పేరు నాని. సినిమాలో నాని పాత్ర‌లో న‌రేష్ చాలా పిరికోడి గా క‌నిపిస్తుంటాడు. అందుకే నాని ఇంటర్వ్యూ లో న‌రేష్‌ తో మాట్లాడుతూ `నేను పిరికోడిని అని నా పేరు పెట్టుకొన్నావా?` అని ప్ర‌శ్న అడిగాడు. అలాగ‌ని కాదు... అయినా నీ పేరు న‌వీన్ క‌దా అని నాని అస‌లు పేరును బ‌య‌ట‌పెట్టాడు న‌రేష్‌. స‌ర‌దాగా సాగిన ఈ ఇంట‌ర్వ్యూ సినిమా ప్ర‌మోష‌న్‌ కి మేలే చేస్తుంది. చాలా రోజులుగా హిట్టు లేక ఇబ్బందులు ప‌డుతున్న న‌రేష్‌ కి `జేమ్స్‌ బాండ్‌` ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.