Begin typing your search above and press return to search.

నాపై పెద్ద నింద వేశారు..నాగ్‌ సర్‌ కూడా అంతే

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:34 AM GMT
నాపై పెద్ద నింద వేశారు..నాగ్‌ సర్‌ కూడా అంతే
X
స్మార్ట్‌ ఫోన్‌ ల కాలం నడుస్తోంది. పక్కన్న పది మంది మనుషులు ఉన్నా కూడా పట్టించుకోకుండా చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ లపైనే ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. స్టార్మ్‌ ఫోన్‌ లు వచ్చినప్పటి నుండి మనుషులతో డైరెక్ట్‌ గా మాట్లాడటం కంటే ఛాటింగ్‌, బ్రౌజింగ్‌ లతోనే జనాలు టైం ను ఎక్కువగా గడిపేస్తున్నారు అనే విషయం అందరికి తెల్సిందే. అందరిలాగే నాని కూడా స్మార్ట్‌ ఫోన్‌ పిచ్చోడు అని, చేతిలో ఫోన్‌ ఉంటే పక్కన్న అమ్మాయి ఉన్నా పట్టించుకోడు అంటూ నాని ఒక చిన్న వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

‘దేవదాస్‌’ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా నాగార్జున చేసిన ఆ వీడియో వైరల్‌ అయ్యింది. నాగార్జునతో పాటు రానా- రకుల్‌ ఇంకా పలువురు కూడా ఐ అగ్రీ అంటూ స్పందించారు. దాంతో నాని కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపిస్తుంది. తాజాగా ‘దేవదాస్‌’ చిత్రం ప్రమోషన్స్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడిన చిత్ర యూనిట్‌ సభ్యులు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్బంగా నాని తనపై నాగార్జున చేసిన వీడియో గురించి స్పందించాడు.

నాని మాట్లాడుతూ.. నేను బేసిక్‌ గా ఫోన్‌ ఎక్కువ వాడి ఉండవచ్చు - కాని నాగ్‌ సర్‌ పక్కన్న ఉన్నప్పుడు మాత్రం నేను ఫోన్‌ వాడలేదు. స్వప్ప మరియు ప్రియాంక ఇతరులు చెప్పిన విషయాన్ని విని నాగ్‌ సర్‌ వీడియో చేశారు, ఆ వీడియో వైరల్‌ అయ్యి, రానా - రకుల్‌ లు కూడా ఐ అగ్రీ అంటూ కామెంట్‌ చేశారు. ఇది నాపై ఒక నిందలా తయారు అయ్యింది అన్నాడు. ఆ వీడియో కొంత నిజం ఉంది, కాని మొత్తం నిజం కాదు అన్నాడు. మేకింగ్‌ వీడియోలో అక్కడక్కడ ఫోన్‌ పట్టుకుని ఉండటం చాలా కామన్‌ గా కనిపిస్తుంది. ఇంకా మేకింగ్‌ వీడియోలు చూస్తే నాగ్‌ సర్‌ ఫోన్‌ వాడుతున్న క్లిప్‌ లు కూడా దొరుకుతాయి అన్నాడు. నాని ఈ విషయంలో కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అయినట్లుగా అనిపిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఫోన్‌ లు వాడటం చాలా కామన్‌, పాపం నానిపై నాగ్‌ అలాంటి వీడియో చేయకుండా ఉంటే బాగుండేది అంటూ నాని అభిమానులు అంటున్నారు.