Begin typing your search above and press return to search.

నాని రేంజ్ బాగా పెరిగిందిగా

By:  Tupaki Desk   |   9 Feb 2016 11:30 AM GMT
నాని రేంజ్ బాగా పెరిగిందిగా
X
ఈ వారంలో నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 12న విడుదలయ్యే ఈ మూవీని.. ఇఫ్పటి వరకూ నాని కెరీర్ లోనే భారీగా రిలీజ్ చేయనున్నారు. నాని గత చిత్రం భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. ఈ సినిమాపై అంచనాలు ఎక్కవైపోయాయి. కేవలం హైద్రాబాద్ లోనే 70 స్క్రీన్లకు పైగా కృష్ణగాడి వీర ప్రేమగాధను రిలీజ్ చేయనున్నారు.

మొదటి వీకెండ్ కోసం బుక్ చేసిన థియేటర్స్ ఇవి. ఒకవేళ ఫస్ట్ డే టాక్ బాగుంటే.. రెండో రోజు నుంచి థియేటర్ల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్సులున్నాయని తెలుస్తోంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రేంజ్ లోనే నాని మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. స్టార్ హీరోకి ఏ మాత్రం తగ్గని రేంజ్ కృష్ణగాడి వీర ప్రేమగాధ విడుదల అవుతోంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ హవా కనిపిస్తోంది. 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాని అమెరికాలో 125కు పైగా స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. టాక్ ను బట్టి స్క్రీన్లు పెంచే స్కెచ్ ఇక్కడ కూడా సిద్ధంగానే ఉంది.

భలేభలే మగాడివోయ్ తర్వాత నాని రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి.. కృష్ణగాడి వీర ప్రేమ గాధను డైరెక్ట్ చేయగా.. మెహ్రీన్ పీర్జాడా కౌర్ ఈ మూవీతో టాలీవుడ్ తెరంగేట్రం చేయనుంది. ఈ మూవీ కూడా సక్సెస్ సాధిస్తే.. నాని స్టార్ లీగ్ లో ఎంటర్ అవుతాడనే అంచనాలు ఉన్నాయి.