Begin typing your search above and press return to search.

ప్రతీ సినిమాలో కొత్త నాని ఉంటాడు

By:  Tupaki Desk   |   10 Feb 2016 7:30 AM GMT
ప్రతీ సినిమాలో కొత్త నాని ఉంటాడు
X
భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ తర్వాత.. నానిలో చాలా ఛేంజ్ వచ్చిందనే టాక్ ఉంది. కానీ.. ఫ్లాపుల్లో ఉన్న నానియే ఇప్పుడు కూడా అంటున్నాడు ఈ నేచురల్ స్టార్. అందరూ స్టార్ అని అంటున్నారు కానీ.. అష్టాచెమ్మా చేయడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నానియే ఇప్పుడు కూడా అని చెబుతున్నాడు. సినిమాల ఎంపికలో కేర్ పెరిగిందన్న మాటను కూడా ఒప్పుకోవడం లేదు ఈ హీరో.

గతంలో తాను నమ్మిన సినిమాలన్నీ ఆడలేదని, భలేభలే మగాడివోయ్ కూడా నమ్మే చేశానన్న నానీ.. అది మాత్రం ఆడిందనే విషయాన్ని గుర్తి చేశాడు. అంటే.. తాను ఆ సినిమాతో కొత్తగా నేర్చుకున్నది ఏం లేదని.. గతంలో ఉన్నట్లుగానే ఇప్పుడూ ఉన్నానని చెప్పాడు. అలాగే సక్సెస్ కాంబినేషన్లు సెట్ చేసుకుందామనే ఆలోచన కూడా చేయడం లేదట. నాని ఇలాంటి సినిమా చేశాడేంటి అని అనుకున్న కొన్నింటి కోసం.. తను వదులుకున్న సినిమాలు తెలిస్తే ఆశ్చర్యపోతారంటున్నాడు. అలాగని తను వద్దంటే వేరే హీరోలు చేశారన్న మాట అనబోనని చెప్పాడు

ఇప్పుడైనా సరే నాని నుంచి ఎలాంటి సినిమాలు కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో, తను అలాంటివే చేస్తానని చెప్పిన నాని.. ప్రతీ సినిమాలో కొత్త నానిని చూడ్డం ఖాయమంటున్నాడు. తను చేసిన ఏ మూవీలో అయినా కేరక్టర్ మాత్రమే ఉంటుందని, నాని కనిపించడని అన్నాడు. ఇక కృష్ణగాడి వీర ప్రేమగాధతో డైరెక్టర్ హను రాఘవపూడి ప్రేక్షకులకు షాక్ ఇవ్వడం ఖాయమని చెబ్తున్నాడు.