Begin typing your search above and press return to search.

జెంటిల్మన్ నాని.. సెగలురేపుతున్నాడు

By:  Tupaki Desk   |   27 April 2016 8:33 AM GMT
జెంటిల్మన్ నాని.. సెగలురేపుతున్నాడు
X
హీరోనా.. విలనా.. అంటూ నాని కొత్త సినిమా ‘జెంటిల్మన్’కు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్లు ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యాయి. నాని కెరీర్లో ఇది మరో వైవిధ్యమైన చిత్రం కాబోతోందన్న సంకేతాలిచ్చాయి ఆ పోస్టర్లు. ‘అష్టాచెమ్మా’ సినిమాతో తనకు హీరోగా కెరీర్ ప్రసాదించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా ఇది. ఒక్క ఫస్ట్ లుక్ పోస్టరుతో సరిపెట్టకుండా అప్పుడప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తే సినిమా మీద ఆసక్తి మరింత పెంచుతున్నాడు ఇంద్రగంటి. లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది.

లగ్జరీ కారు ఇంజిన్ మీద సూటేసుకుని కూర్చుని సీరియస్ గా కనిపిస్తున్నాడు నాని. తలకు దెబ్బ తగిలి రక్తం కూడా కారుతోంది. పోస్టర్ మీద ఎప్పట్లాగే.. హీరోనా.. విలనా.. అనే ట్యాగ్ కూడా కనిపిస్తోంది. పోస్టర్ ఆంతర్యమేంటో అంతు బట్టట్లేదు. ఈ సినిమాతో ఇంద్రగంటి తెలుగు సినిమాకు ఓ కొత్త జానర్ పరిచయం చేస్తాడని ఇంతకుముందే చెప్పాడు నాని. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అని.. నాని ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడని చెబుతున్నారు. మలయాళీ బ్యూటీ నివేదా థామస్.. తమిళమ్మాయి సురభి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగి.. కొన్నేళ్లుగా కనుమరుగైపోయిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తుండటం విశేషం. జూన్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.