Begin typing your search above and press return to search.

నానిని ఉక్కిరిబిక్కిరి చేసారు

By:  Tupaki Desk   |   24 Feb 2018 8:16 AM GMT
నానిని ఉక్కిరిబిక్కిరి చేసారు
X
న్యాచురల్ స్టార్ నాని బిరుదుకే కాని ఇమేజ్ లో అంతకు మించి అనేలా ఎదుగుతున్నాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన రాధా గోపాళం సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన నవీన్ ఘంటా బాబు అనే కుర్రాడు 34 ఏళ్ళ వయసు వచ్చే నాటికి యూత్ అండ్ ఫ్యామిలీస్ మెచ్చే యునిక్ హీరోగా మారడంలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. యావరేజ్ కంటెంట్ తో సైతం నిర్మాతలు సేఫ్ అయ్యే చేసే రేంజ్ కు చేరుకున్న నాని పుట్టిన రోజు నేడు. నిన్న అర్ధరాత్రి ఊహించని రీతిలో అభిమానులు హటాత్తుగా నాని ఆఫీస్ కు పూల బొకేలు, కేకులతో చేరుకొని నానా హడావిడి చేసారని టాక్. మొదట కొద్దిగా ఉన్న సంఖ్య అర్ధరాత్రి పన్నెండు దగ్గర పడే కొద్ది అంతకంతకు పెరుగుతూ పోవడంతో రద్దీని కంట్రోల్ చేయటం కోసం నాని పోలీస్ రిక్వెస్ట్ చేసే దాకా వెళ్ళిందని సమాచారం.

నానికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే కాని అది ఏ రేంజ్ లో ఉందో నిన్న రాత్రి మరోసారి ప్రూవ్ అయినట్టే. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి స్వింగ్ మీదున్న నాని ఏప్రిల్ లేదా మేలో తాను మూడో సారి డ్యూయల్ చేసిన కృష్ణార్జున యుద్ధంతో పలకరించనున్నాడు. మాస్, క్లాస్ అంటూ రెండు విభిన్నమైన స్లాంగ్, వేషధారణతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎంటర్టైనర్స్ ని బాగా డీల్ చేస్తాడని పేరున్న మేర్లపాక గాంధీ దీనికి దర్శకుడు కావడం ప్లస్ గా మారుతోంది. దీని తర్వాత నాని నాగ్ తో చేయబోయే మల్టీ స్టారర్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దినదిన ప్రవర్ధమానమవుతున్న నాని వయసు 34. కెరీర్ బలంగా సెట్ చేసుకుంటున్న నాని ఇలాగే కన్సిస్టెంట్ గా హిట్లు అందుకుంటే స్టార్ డం ఇంకాస్త ఎగబాకుతుంది అనడంలో డౌట్ అక్కర్లేదు. ఏదో ఒక వర్గానికి పరిమితమై ఒకే తరహా సినిమాలు తీయకుండా కొత్తగా ట్రై చేస్తున్న నాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.