Begin typing your search above and press return to search.

నాని డబుల్ 'ధమాకా' ఇస్తున్నాడోచ్

By:  Tupaki Desk   |   13 Feb 2016 11:53 AM GMT
నాని డబుల్ ధమాకా ఇస్తున్నాడోచ్
X
నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు హీరో నాని. అందుకే ముద్దుగా నేచురల్ స్టార్ అయిపోయాడు. ఇప్పటికే రెండు వరుస హిట్స్ తో జోష్ మీదున్న నాని.. ఇప్పుడు హ్యాట్రిక్ కంప్లీట్ చేసేందుకు సిద్ధమయిపోయాడు. ఈసారి కూడా మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ వెర్సటైల్ హీరో.

నానిని పరిశ్రమకి పరిచయం చేసిన ఇంద్రగండి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఆ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో.. ఒకే సిట్టింగ్ లో యాక్సెప్ట్ చేసేసి మూవీ స్టార్ట్ చేసేశాడు కూడా. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఈ చిత్రానికి ధమాకా అనే టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అన్నింటి కంటే పెద్ద విశేషం ఏంటంటే.. నాని డబుల్ రోల్ చేస్తుండడం. అఫ్ కోర్స్.. ఈ విషయాన్ని నాని కన్ఫాం చేయకపోయినా.. ఇప్పటికే న్యూస్ లీక్ అయిపోయింది. ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

అష్టాచమ్మా చిత్రంతో నానితో పాటు టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీనివాస్ అవసరాల కూడా.. ఓ కీలకమైన రోల్ చేస్తున్నాడు. మళయాళ హీరోయిన్ నివేదా థామస్, ఎక్స్ ప్రెస్ రాజా హీరోయిన్ సురభిలు.. తొలిసారిగా నానితో జత కట్టబోతున్నారు. ప్రస్తుతం నాని ఫుల్లు క్రేజ్ లో ఉండడం, సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో.. ఇప్పటికే ధమాకా మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.