Begin typing your search above and press return to search.

మల్టీ స్టారర్ సినిమాల్లో కుర్రాడికి డిమాండ్

By:  Tupaki Desk   |   3 May 2016 12:37 PM GMT
మల్టీ స్టారర్ సినిమాల్లో కుర్రాడికి డిమాండ్
X
టాలీవుడ్ లో కుర్ర హీరో రాజ్ తరుణ్ హవా బాగానే కొనసాగుతోంది. సోలో హీరోగానే మూడు వరుస హిట్స్ సాధించిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత మంచు విష్ణుతో చేసిన మల్టీ స్టారర్ మూవీ ఈడో రకం ఆడో రకం తోనూ హిట్ కొట్టాడు. దీంతో ఇప్పుడీ కుర్ర హీరోతో మల్టీ స్టారర్ సినిమాలకు ఇండస్ట్రీలో చాలామంది ట్రై చేస్తున్నారు.

మల్టీస్టారర్ సినిమాలు చేయడం అంటే సేఫ్ అని రాజ్ తరుణ్ కూడా భావిస్తున్నాడు. సినిమాకి సంబంధించిన మొత్తం భారాన్ని తనే మోయాల్సిన అవసరం ఉండదన్నది ఇతగాడి ఆలోచన అంటున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న నేచురల్ స్టార్ నానితో.. రాజ్ తరుణ్ ని కలిపి మల్టీ స్టారర్ ఆలోచన చేస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. అటు నాని - ఇటు రాజ్ తరుణ్.. ఇద్దరికీ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉండడం.. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కావడంతో.. వీరి కాంబినేషన్ సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని యోచిస్తున్నారు.

నాని - రాజ్ తరుణ్ ల మల్టీస్టారర్ కోసం ఇప్పుడు కథలు కూడా సిద్ధమైపోతున్నాయని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే కమర్షియల్ సక్సెస్ గ్యారంటీ అనే ఫీలింగ్ ఎక్కువకావడమే ఇందుకు రీజన్. మొత్తానికి వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాకి సైన్ చేస్తే మాత్రం.. యంగ్ హీరోల మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకున్నట్లే.