Begin typing your search above and press return to search.

మర్డ‌ర్ మిస్ట‌రీతో నాని సినిమా

By:  Tupaki Desk   |   30 Nov 2015 1:30 AM GMT
మర్డ‌ర్ మిస్ట‌రీతో నాని సినిమా
X
భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ తో క‌డుపుబ్బా న‌వ్వించాడు నాని. త్వ‌ర‌లో `జై బాల‌య్య‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆ సినిమాలో క్యారెక్ట‌ర్ ఏంటో, ఆ సినిమా క‌థా క‌మామిషూ ఏమిటో ఎవ్వ‌రికీ తెలియ‌దు కానీ... ఆ త‌ర్వాత మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని చేయ‌నున్న సినిమా మాత్రం ఓ సీరియ‌స్ క‌థ‌తోనే తెర‌కెక్కనున్న‌ట్టు తెలుస్తోంది. ఒక మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ సాగే క‌థ అని తెలిసింది. అదే నిజ‌మైతే నాని ఇప్ప‌టిదాకా చేయ‌న‌టువంటి జాన‌ర్ అది. ఎలాంటి జోన‌ర్ క‌థ‌తోనైనా ఒప్పించే నాని క్రైమ్ నేప‌థ్యంతో కూడిన క‌థ‌లో ఎలా ఒదిగిపోతాడో చూడాలి మ‌రి.

మోహ‌నకృష్ణ ఇంద్రగంటి ద‌ర్శ‌క‌త్వంలోనే నాని తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. వాళ్లిద్ద‌రూ క‌లిసి చేసిన అష్టాచ‌మ్మా ఘ‌న విజ‌యం సాధించింది. అది కామెడీ ప్ర‌ధానంగా తెర‌కెక్కింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి మ‌రోసారి ప‌నిచేస్తున్నారంటే అంచ‌నాలు ఉంటాయి. అయితే ఇంద్ర‌గంటి చేసిన జోన‌ర్‌ ని మ‌ళ్లీ చేయ‌డు. ఎప్ప‌టిక‌ప్పుడు తెర‌పై ఓ కొత్త క‌థ‌ని చూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈసారి త‌న‌కీ, నానికీ ఇద్ద‌రికీ కొత్త‌గా ఉంటుందనే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో క‌థ రాసుకొన్నాడ‌ట‌. అందులో నాని పాత్ర ఏంట‌న్న‌ది ఇప్ప‌టిదాకా బ‌య‌టికి రాలేదు. అయితే ఈ సినిమాలో బుల్లితెర న‌టి శ్రీముఖి మాత్రం ఓ జ‌ర్న‌లిస్టు పాత్ర‌ని పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌బోతోంది.