'అదిగో అల్లదిగో' అంటున్న నాని

Fri Apr 21 2017 11:14:34 GMT+0530 (IST)

మన తెలుగు లో ప్రతివారికి నచ్చే ఒక హీరో.. నాని. పాత తరం ఊత పదం ఉండేది 'ఈడు మనోడే' అని.. అలాంటి వాడే నాని కూడా. వరుస హిట్లు కాదు వరుస పెట్టి రెండు హెట్రిక్ లు కొట్టిన ఒక చిన్న పెద్ద హీరో నాని. ఇప్పుడు యమా స్పీడు మీదున్నాడు.

బాబు బాగా బిజీ గా ఉన్నాడు అనే టాగ్ లైన్ నాని ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే వరసగా ఇప్పుడు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి మరి. అంటే మరో హెట్రిక్ కొట్టడానికి  సిద్ధం అయ్యాడనమాట. కొత్త డైరెక్టర్ శివ డైరక్షన్ లో 'నిన్ను కోరి' అనే సినిమా షూటింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఇది జూలై లో విడుదల కావచ్చు. ఆ తరువాత హను రాఘవపూడి తో మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి సై అన్నాడట కుర్రాడు. హను రాఘవపూడి ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సక్సెస్ తో మళ్ళీ అతని తో సినిమా కు ఓకే చెప్పాశాడని..  ఒక ఫేమస్ అన్నమయ్య కృతి నుండి ఇనస్పయిర్ అయ్యి ఈ సినిమాకు ''అదిగో అల్లదిగో'' అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది 2017 డిసెంబర్ లో మొదలుకావచ్చు.

ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం లో రానున్న ‘ఎంసిఏ’ అనే మూవీ ప్రీ  ప్రొడక్షన్ జరుగుతోంది. దీనికి డైరెక్టర్ గా వేణు శ్రీరామ్. ఈ సినిమా తరువాత హను రాఘవపూడి ‘అదిగో అల్లాదిగో’ మొదలవుతుంది. ప్రస్తుతం హను కూడా నితిన్ తో తీస్తున్న ‘లై’ తో బాగా బిజీ గా ఉన్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/