Begin typing your search above and press return to search.
జై బాలయ్య అని పొడిపించుకున్న నాని
By: Tupaki Desk | 27 Nov 2015 5:30 PM GMTస్టార్ హీరోలకు ఫ్యాన్స్ గా కుర్ర హీరోలు చేయడం, వాళ్ల ఫాలోయింగ్ ని అడ్డం పెట్టుకుని తమ సినిమాలకు క్రేజ్ తెచ్చుకోవడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. కానీ స్టార్ హీరో అయ్యాక కూడా.. ఓ సీనియర్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా నటించడం మాత్రం ఇప్పుడే జరుగుతోంది.
భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ కావడంతో జోష్ మీదున్న నాని.. ఇప్పుడు జాగ్రత్తగా ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరెక్షన్ లో.. ఈ నేచురల్ స్టార్ తర్వాత మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా నటిస్తున్నాడు నాని. అంతేకాదు.. జై బాలయ్య అంటూ చేతిపై టాటూ కూడా వేయించేసుకున్నాడు. దీన్నే ఇప్పుడు అందరికీ ప్రదర్శిస్తున్నాడు నాని.
సైజ్ జీరో ప్రీమియర్ షోకి వచ్చి.. జై బాలయ్య టాటూతో నాని దొరికిపోయాడు. దీంతో ఆ టాటూ కనిపించేలా ఫోటో ఫోజులివ్వాలంటూ ఫోటోగ్రాఫర్స్ వెంటబడ్డారు. అఫ్ కోర్స్.. మన భలే మగాడు ఏమాత్రం దాచుకునేందుకు ప్రయత్నించలేదు లెండి. ఇప్పటికి చాలావరకూ షూటింగ్ పూర్తైన ఈ మూవీ.. అనంతపురం, హిందూపురం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మొత్తం మీద ఓ హీరో తొలిసారిగా నటసింహం అభిమానిగా కనిపించనున్నాడు. ఈ మూవీపై నందమూరి అభిమానుల్లోనూ ఆసక్తి ఉండడం విశేషం.