Begin typing your search above and press return to search.

నాని లిప్ లాక్.. భార్య కన్నీళ్లు

By:  Tupaki Desk   |   1 Sep 2015 7:42 AM GMT
నాని లిప్ లాక్.. భార్య కన్నీళ్లు
X
సినిమా హీరో అంటే లక్షల మంది అమ్మాయిల కళ్లు అతడిపై ఉంటాయి. అలాంటోడి భార్యగా ఉండటమంటే కొంచెం క్రేజీగా అనిపించొచ్చు. అదే సమయంలో చాలా ఇన్ సెక్యూర్ ఫీలింగ్ కూడా ఉండొచ్చు. అందుకే పెళ్లికి ముందే మన హీరోలు కాబోయే అమ్మాయికి తన ప్రొఫెషన్ గురించి.. వచ్చే రూమర్ల గురించి.. క్రిస్టల్ క్లియర్ గా చెప్పేస్తుంటారు. అయినా కూడా కొంచెం సెన్సిటివ్ గా ఉండే అమ్మాయి అయితే ఇబ్బందులు తప్పవు. అన్ని విషయాల్నీ లైట్ తీసుకోకపోవచ్చు. తన సతీమణి అంజన ఈ టైపే అంటున్నాడు నాని. తను చాలా సెన్సిటివ్ అని.. తెరమీద అమ్మాయిలతో రొమాన్స్ చేస్తే తట్టుకోలేదని చెప్పాడు నాని. ‘ఆహా కళ్యాణం’ సినిమాలో చేసిన లిప్ లాక్ విషయంలో తాను పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదని.. మళ్లీ ఎప్పుడూ ఏ సినిమాకూ లిప్ లాక్ చేయకూడదని గట్టిగా ఫిక్సయిపోయేలాంటి అనుభవం తనకు ఎదురైందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

‘ఆహా కళ్యాణం’ హిందీ మూవీ ‘బ్యాండ్ బాజా బారత్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ లో బోలెడు లిప్ లాక్స్ ఉంటాయి. తెలుగులోకి వచ్చేటప్పటికీ ఒక్కటైనా ఉండకపోతే ఎలా అనుకున్నారేమో.. నానికి, వాణికి ఓ లిప్ లాక్ సెట్ చేశారు. నాని కూడా ఎలాగోలా చేసేశాడు. కానీ తీరా తెరమీద దాన్ని చూసేటపుడు చాలా ఇబ్బందైందని.. తన భార్య అంజన ఆ సినిమా రాబోతుంటే థియేటర్ నుంచి బయటికి వచ్చేసిందని చెప్పాడు నాని. ‘‘ఆ సన్నివేశంతో నా వైఫ్, కజిన్స్ ముందు నా లెవెల్ తగ్గిపోయింది. నా భార్య విషయంలో అయితే చాలా కంగాళీ అయిపోయింది. థియేటర్ నుంచి బయటికి వచ్చేసింది. లోపలికి మళ్లీ రానని మంకు పట్టు పట్టుకుని కూర్చుంది. కళ్లల్లో నీళ్లు కూడా వచ్చేశాయి. ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు. చాలా సెన్సిటివ్. సినిమా టాక్ ఏంటి? ఎలా ఆడుతోంది అని పట్టించుకోకుండా.. తనను సముదాయించడమే పనైపోయిందది. అప్పుడే అనుకున్నా.. మళ్లీ లిప్ లాక్ వద్దు అని’’ అని నాని చెప్పాడు.