శ్రీరెడ్డి-నాని ఎఫైర్ పై స్పందించిన నాని భార్య

Tue Jun 12 2018 13:40:06 GMT+0530 (IST)

బిగ్ బాస్ సీజన్ 2 మొదలైంది. ఇప్పటికే రెండు రోజులు గడిచాయి. అయితే తాజాగా బిగ్ బాస్ లోకి తనను ఎంపిక చేసినప్పటికీ దాన్ని నాని అడ్డుకున్నారని శ్రీరెడ్డి విమర్శలు  చేసిన సంగతి తెలిసిందే.. అంతేకాదు నానిపై పలు తీవ్ర ఆరోపణలు చేసి శ్రీరెడ్డి సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన నాని.. శ్రీరెడ్డిపై న్యాయపోరాటానికి దిగాడు. తన పరువు తీస్తున్న శ్రీరెడ్డికి లాయర్ల ద్వారా నోటీసులు పంపి ఆమెను కోర్టుకీడ్చాడు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న తెలుగు టీవీ చానెల్ ‘స్టార్ మా’ యాజమాన్యం కూడా నాని-శ్రీరెడ్డి వివాదంపై స్పందించింది. బిగ్ బాస్ సీజన్ 2 పోటీదారుల గురించి వివరించిన స్టార్ మా.. తాము మొత్తం 125మంది పేర్లను  పరిశీలించామని.. వారిలో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని స్పష్టం చేశారు. పేరును పరిశీలించినంత మాత్రాన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వలేమని.. కంటెస్టెంట్స్ జాబితాలో ఎవరినీ ఉంచాలి.? ఎవరినీ ఉంచవద్దు అన్న విషయాల్లో నాని ఎప్పుడూ కలుగజేసుకోలేదని వెల్లడించింది.

ఇలా ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యవహారం నానికే కాదు.. స్టార్ మా చానెల్ కు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది. సెలబ్రెటీల జాబితాలో మొదట శ్రీరెడ్డిని అనుకోవడం.. ఆ తర్వాత ఆమెను తీసుకోకపోవడంతో దీనంతటికి నాని కారణమని ఆమె అనుకుంది. నాని పరువు తీయడమే పనిగా పెట్టుకుంది. ఈ పరిణామాలన్నీ నాని వ్యక్తిగత జీవితానికి ఎసరు తెస్తున్నాయి.

తాజాగా నాని భార్య శ్రీరెడ్డి విమర్శలపై ట్విట్టర్ ద్వారా స్పందించింది. నానితో ఎఫైర్ ఉందన్న శ్రీరెడ్డికి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది.. ‘సినీ పరిశ్రమ చాలా దయాగుణంతో ఉంటుంది. కానీ పబ్లిసిటీ కోసం వేరొకరి జీవితాలతో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడూ అందులోకి వస్తుండడం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవరూ పట్టించుకోరనుకోండి. కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగజార్చుకోవడానికి వారు ఎలా సిద్ధపడతారో’ అంటూ అంజన తన భర్త మంచోడని సర్టిఫికెట్ ఇచ్చింది.