Begin typing your search above and press return to search.
నాని డబుల్ ధమాకా ప్లాన్ అదిరిందిలే
By: Tupaki Desk | 17 Sep 2019 8:06 AM GMTసూపర్ బిజీ షెడ్యూల్స్ లోనూ ఫ్యామిలీ లైఫ్ ని మ్యానేజ్ చేయడం ఎలానో ఆరోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ- శోభన్ బాబు చేసి చూపించారని చెబుతుంటారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అదే పంథాని అనుసరించి ఫ్యామిలీ మ్యాన్ గా పాపులరయ్యారు. అప్పట్లోనే ఏడాదికి డజను సినిమాల్లో నటించేస్తూ కృష్ణ ఫ్యామిలీకి టైమ్ కేటాయించేవారు.అందరికీ కుదరనిది కొందరికి కుదిరేది ఇదని భావిస్తుంటారు. అయితే కానే కాదని నిరూపించేందుకు నేటితరంలో సూపర్ స్టార్ మహేష్- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. యంగ్ యమ ఎన్టీఆర్ వంటి వారు నిరూపిస్తున్నారు.
ఇప్పుడు అదే పంథాలో నేచురల్ స్టార్ నాని వెళుతున్నారు. సినిమా తర్వాత సినిమా అంటూ ఎప్పుడూ ఆన్ లొకేషన్స్ కుస్తీలు పట్టే నాని ఇప్పుడు ఆ రూల్స్ ని బ్రేక్ చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలే నాని నటించిన `నానీస్ గ్యాంగ్ లీడర్` రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మరో వారం పాటు వసూళ్లలో దూకుడు చూపిస్తే పంపిణీదారులు సేఫ్ అవుతారన్న చర్చ సాగుతోంది. ఇక తదుపరి నాని `వీ` సినిమాపై దృష్టి సారించాడట. ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలిసి నాని బృందం ఇప్పటికే బ్యాంకాక్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు.
పనిలో పనిగా ఈ షెడ్యూల్ తో పాటుగానే నాని థాయ్ ల్యాండ్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లో ఫ్యామిలీ వెకేషన్ ని ప్లాన్ చేశారట. తనతో పాటే భార్యామణి అంజన.. కుమారుడు అర్జున్ కూడా ఈ వెకేషన్ లో చిలౌట్ చేయబోతున్నారని తెలుస్తోంది. వృత్తిలో విధి నిర్వాహణతో పాటు ఫ్యామిలీ బాధ్యతల్ని బ్యాలెన్స్ చేయడమే జీవితం అని ప్రూవ్ చేస్తున్నారన్నమాట. ఇక `వీ` చిత్రంలో నాని విలన్ గా నటిస్తుంటే సుదీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. దొంగా పోలీస్ మైండ్ గేమ్ నేపథ్యంలోని సినిమా ఇదని ప్రచారం సాగుతోంది. ఇంద్రగంటి ఆ ఇద్దరి మధ్యా గేమ్ ని ఎలా మ్యానేజ్ చేస్తారన్నది చూడాలి.