Begin typing your search above and press return to search.

వివాదాల హీరోతో న్యాచురల్ స్టార్ సినిమా

By:  Tupaki Desk   |   18 Sep 2019 8:01 AM GMT
వివాదాల హీరోతో న్యాచురల్ స్టార్ సినిమా
X
న్యాచురల్ స్టార్ నాని హీరోగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై 'అ!' సినిమా నిర్మించాడు. సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి. ఆ సినిమా తర్వాత కొన్ని స్మాల్ బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించాడు. తాజాగా నాని నెక్స్ట్ ప్రొడక్షన్ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

'ఫలక్ నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ తో నాని ఒక సినిమా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. డైరెక్టర్ ఎవరు.. కథ ఎలాంటిది అనే వివరాలు తెలియదు కానీ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. విశ్వక్ సేన్ నటుడిగా మంచి మార్కులే తెచ్చుకున్నా 'ఫలక్ నుమా దాస్' ప్రమోషన్స్ సమయంలో చేసిన హంగామా అందరికీ గుర్తుంది. పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో బూతులు వాడడంపై తీవ్రంగా విమర్శలు చెలరేగాయి. అయితే అలాంటివాటిని ఏమాత్రం పట్టించుకోకుండా విశ్వక్ తో నాని ఒక సినిమాను నిర్మించడానికి రెడీ కావడం అందరినీ ఆకర్షిస్తోంది.

విమర్శలు.. వివాదాలు పక్కన పెడితే విశ్వక్ కు మాత్రం హీరోగా ఇప్పుడు మంచి డిమాండే ఉంది. సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విశ్వక్ హీరోగా ఒక రీమేక్ సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. బాలీవుడ్ చిత్రం 'సోను కి టిటు కి స్వీటీ' కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందట.