Begin typing your search above and press return to search.

నాని మూవీ.. అవన్నీ పుకార్లేనా?

By:  Tupaki Desk   |   18 Feb 2019 1:08 PM GMT
నాని మూవీ.. అవన్నీ పుకార్లేనా?
X
'మనం', '24' చిత్రాలతో అలరించిన దర్శకుడు విక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ లో ఒక చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. బన్నీతో క్యాన్సిల్‌ అవ్వడంతో నానితో సినిమాను చేసేందుకు విక్రమ్‌ కుమార్‌ రెడీ అయ్యాడు. చాలా రోజుల క్రితమే వీరి కాంబోలో మూవీకి అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్‌ విషయంలో పలు వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

సినీ సర్కిల్స్‌ మరియు మీడియా వర్గాల్లో ఈ చిత్రం కోసం ఆరుగురు సీనియర్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ను విక్రమ్‌ కుమార్‌ ఎంపిక చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆరుగురు హీరోయిన్స్‌ లో అయిదుగురు హీరోయిన్స్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా కనిపించబోతున్నారు, ఒక హీరోయిన్‌ మాత్రం నానితో రొమాన్స్‌ చేయనుందని అన్నారు. నాని, విక్రమ్‌ కుమార్‌ ల మూవీకి పలు పేర్లు వినిపించాయి. చివరకు ఈ చిత్రంకు అంతా కొత్త హీరోయిన్స్‌ ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఒక హీరోయిన్‌ గా తమిళ ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఎంపిక అయ్యింది. నేడు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. ప్రియాంకతో పాటు మరో ముగ్గురు కొత్త హీరోయిన్స్‌ ఎంపిక కూడా పూర్తి అయ్యిందని, అయితే మెయిన్‌ లీడ్‌ మాత్రం ప్రియాంక అరుల్‌ మోహన్‌ అంటూ సమాచారం అందుతోంది. మోడల్‌ గా రాణించిన ప్రియాంక అరుల్‌ ఈమద్య తమిళ సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కించుకుంటుంది. రెండు మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న ఈమెకు నాని మూవీలో కూడా ఛాన్స్‌ దక్కింది.