Begin typing your search above and press return to search.

ఈసారి ఆ హీరోనే బిగ్ బాస్?

By:  Tupaki Desk   |   17 March 2018 4:13 AM GMT
ఈసారి ఆ హీరోనే బిగ్ బాస్?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లోని కొత్త కోణాన్ని అందరికీ పరిచయం చేసింది బిగ్ బాస్ షో. స్టార్ మా లో వచ్చిన ఈ రియాలిటీ షోకు పెద్ద అస్సెట్ గా నిలిచింది ఎన్టీఆర్ హోస్టింగేనని చెప్పక తప్పదు. ఈ షోలో వారానికి రెండు రోజులే ఎన్టీఆర్ కనిపించినా తన చలాకీతనం.. మాటకారితనంతో అందరినీ భలేగా మెప్పించాడు. తమిళ బిగ్ బాస్ కన్నా తెలుగులో ఎక్కువ పాపులారిటీ రావడానికి ఎన్టీఆర్ హోస్టింగే కారణమని చెప్పాలి.

బిగ్ బాస్ సీజన్ 2 కోసం స్టార్ మా సిద్ధం అవుతోంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఎన్టీఆర్ ను ఈ షో తీసుకుందామని అనుకున్నా ప్రస్తుతం అతడి డెయిరీ అస్సలు ఖాళీలేదు. దీంతో ఎన్టీఆర్ ప్లేసులో నాచురల్ స్టార్ నానిని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. అతడయితేనే ఈ షోను ఎన్టీఆర్ కు దీటుగా రక్తి కట్టించగలడని స్టార్ మా టీం భావిస్తోంది. నాని రేడియో జాకీగానే కెరీర్ మొదలు పెట్టాడు. ఓ షోను ఎలా హోస్ట్ చేయాలో అతడికి బాగా తెలుసు. అదీగాక ఐఫా అవార్డ్ -2017 ఈవెంట్ లో రానాతో కలిసి హోస్టింగ్ చేసి అదరగొట్టేశాడు. నాని మాటకారితనం కూడా అతడికి మరింత ప్లస్సవుతుందని స్టార్ మా టీం సభ్యుడొకరు తెలిపారు.

బిగ్ బాస్ సీజన్-2 కు హోస్ట్ చేసే విషయమై ఛానల్ వాళ్లు ఇప్పటికే నానిని కాంటాక్ట్ చేసి ఒప్పించారని తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ స్టేట్ మెట్ త్వరలో వచ్చే అవకాశముంది. ఈ షో చేసేందుకు నానికి కూడా భారీ మొత్తమే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.