Begin typing your search above and press return to search.

తిరుపతిలో.. ప్యారిస్ లో.. కామెడి

By:  Tupaki Desk   |   20 July 2017 11:36 AM GMT
తిరుపతిలో.. ప్యారిస్ లో.. కామెడి
X
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నెమ్మదిగా తన లోకల్ ఇమేజ్ వదిలి స్టార్ ఇమేజ్ వైపు పరుగులు పెడుతున్నాడు. వరుసగా ఆరు సినిమాలు హిట్ ట్రాక్ రికార్డుతో మరింత వేగంగా సినిమాలు చేస్తున్నాడు. నిన్ను కోరి సినిమా కూడా చక్కని విజయం పొందడంతో నాని కొత్త సినిమాలకు కొత్త ఉత్సాహం వచ్చింది. తన హీరో విజయాలు చూసి అతని ఎదుగుదల చేసి ఇప్పుడు పని చేస్తున్న సినిమా యూనిట్ వాళ్ళు మరింత ఉత్తేజంతో ఉన్నారు అని తెలుస్తుంది.

ప్రస్తుతం MCA సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు నాని. ఈ సినిమా పనులు జరుపుతూనే నాని మరో కొత్త కథకు ఓకే చెప్పాడు. ‘కృష్ణార్జున యుద్దం’ అనే టైటిల్ తో ఒక సినిమా ప్రకటించాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు.ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణగా అర్జున్ గా రెండు పాత్రలలో కనిపించనున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాలోని ఒక కథ తిరుపతిలో మరో కథ ప్యారిస్ లో ఉండబోతుందట. ఒకే సినిమాలో రెండు కథలు చెప్పబోతున్నాడట డైరక్టర్. తిరుపతిలో మాస్ కుర్రాడిలా.. ప్యారిస్ పోష్‌ బాయ్ లా నాని మురిపిస్తాడట. గతంలో వచ్చిన 'హలో బ్రదర్' సినిమా తరహాలో ఈ సినిమా కామెడీ టచ్ తో కొత్తగా ఉంటుంది.

చిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రిలో వరుస హిట్లు ఇస్తున్ననానికి ఈ సినిమా మరో కమర్షియల్ హిట్ అవుతుంది అని ఆ చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న MCA కూడా యూత్ కథాంశం కావడంతో నానికి మరింత ప్లస్ అవుతుంది అని తెలుస్తోంది. వరుస సినిమాలు వరుస హిట్ సినిమాలతో నానిని ఇప్పుడు ఒక స్టార్ హీరోగా పరిగణించే సమయం వచ్చింది అని అంటున్నారు ఫిలింనగర్ వాసులు. అది సంగతి.