Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ కు ఈయన బీసీసీఐ లాంటి వారు

By:  Tupaki Desk   |   23 April 2019 6:45 AM GMT
టాలీవుడ్‌ కు ఈయన బీసీసీఐ లాంటి వారు
X
గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది. ఈ చిత్రంలో నాని నటన మరియు గౌతమ్‌ డైరెక్షన్‌ హైలైట్‌ గా నిలిచాయి. చాలా కాలం తర్వాత టాలీవుడ్‌ లో ఫీల్‌ గుడ్‌ మూవీ, మంచి కంటెంట్‌ మూవీ వచ్చిందంటూ నిర్మాత దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాత దిల్‌ రాజు యూనిట్‌ సభ్యులందరిని ఈ సందర్బంగా సన్మానించాడు. మంచి సినిమాను ఇలా అభినందించడం, యూనిట్‌ సభ్యులను ప్రోత్సహించడం మంచి పద్దతి అంటూ హీరో నాని నిర్మాత దిల్‌ రాజుపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ... జెర్సీ సినిమాలో అర్జున్‌ కోసం బీసీసీఐ వారు ఒక ఈవెంట్‌ నిర్వహిస్తారు. అర్జున్‌ గొప్పతనం చాటేందుకు బీసీసీఐ వారు అభినందన సభ నిర్వహించినట్లుగా మా యూనిట్‌ సభ్యులను అభినందించేందుకు దిల్‌ రాజు గారు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. టాలీవుడ్‌ కు దిల్‌ రాజు గారు బీసీసీఐ లాంటి వారు. మంచి సినిమాలను ఆభినందించడం ఆయన మంచితనం. నాది ఏ సినిమా విడుదల అయినా కూడా ఉదయం 9 గంటలకు దిల్‌ రాజు గారి నుండి కాల్‌ వస్తే అది హిట్‌ గా పరిగణిస్తాను. ముందు రోజు, అంతకు ముందు సినిమా చూసి బాగుందని చెప్పినా కూడా ఆ విషయాన్ని నమ్మలేం. సినిమా విడుదలైన రోజు ఉదయం ఆయన ఫోన్‌ చేస్తేనే సినిమా హిట్‌ గా మనం నిర్ధారించుకోవచ్చు. జెర్సీ సినిమా విడుదల అయిన రోజు ఉదయం నేను ఇంటి నుండి బయటకు వస్తున్న సమయంలో ఆయన నుండి ఫోన్‌ వచ్చింది. అప్పటికే కొందరు అంటూ ఉన్నా, నాకు దిల్‌ రాజు గారి ఫోన్‌ రాగానే మరింత నమ్మకం ఏర్పడింది.

దర్శకుడు చాలా నిజాయితీగా ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తుల కథలో కూడా నిజాయితీ ఉంటుంది. నిజాయితీ వ్యక్తులు రాసిన కథలో నిజాయితీ ఉండటం వల్ల ఆ కథలో లైఫ్‌ వస్తుంది. అందుకు చక్కని ఉదాహరణ ఈ కథ. దర్శకుడు గౌతమ్‌ చాలా నమ్మకంతో ఈ చిత్రాన్ని తీశారు. నిర్మాత కూడా ఈ కథను నమ్మడం అంటే సాహసమే. వంశీ గారు ఈ కథను నమ్మినందుకు ఆయనకు థాంక్స్‌, సినిమా బాగా రావడానికి ఎంతో కష్టపడ్డారు, ప్రతి నిత్యం టెన్షన్‌ పడుతూ సినిమా గురించి ఆలోచించేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం సక్సెస్‌ కోసం కష్టపడ్డారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌, ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు కూడా థ్యాంక్‌ అన్నాడు.