Begin typing your search above and press return to search.

రెండో దానికే పెంచేశానంటున్న నాని

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:30 AM GMT
రెండో దానికే పెంచేశానంటున్న నాని
X
యువహీరోలలో ఎటువంటి బ్యాక్ డ్రాప్ లేకుండా స్వశక్తితో టాలీవుడ్ లో నిలదొక్కుకున్న వారిలో నాని ముందు వరుసలో ఉంటాడు. ఫామ్ లో వున్న నానికి మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా తరువాత నిలదొక్కుకుని స్టార్ గా ఎదిగాడు. ముఖ్యంగా భలే భలే మగాడివోయ్ మంచి విజయం సాధించి నాని రేంజ్ ని పెంచేసింది.

నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయంపై నాని కాన్ఫిడెంట్ గా వుండడం శుభపరిమాణం. అయితే భలే భలే విజయం తరువాత నాని పారితోషికం బాగా పెంచాడన్నా వార్తలు వినిపించాయి. ఈ ప్రశ్నే ఆయన్ని అడిగితే నవ్వుతూ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న రెండవ సినిమాకే పారితోషికం పెంచాను. హీరోగా ఇన్ని సినిమాలైనా పెంచానా అని బదులిచ్చాడు.

మొత్తానికి నాని రేటు పెరిగిందన్న మాట వాస్తవం. ప్రస్తుతం తన గురువు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మరియు ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మల ప్రాజెక్ట్లతో బిజీగా వున్నాడు. మణిరత్నంతో డ్రీమ్ ప్రాజెక్ట్ త్వరలో వుంటుందని సమాచారం.