Begin typing your search above and press return to search.

ద‌స‌రాకి నాని బ్యాటింగ్ స్టార్ట్!

By:  Tupaki Desk   |   26 Sep 2018 9:02 AM GMT
ద‌స‌రాకి నాని బ్యాటింగ్ స్టార్ట్!
X
నేచుర‌ల్ స్టార్ నాని ఒక‌దాని వెంట ఒక‌టిగా వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నాగార్జున‌తో క‌లిసి న‌టించిన `దేవ‌దాస్‌` (సెప్టెంబ‌ర్ 27న‌) రిలీజ‌వుతోంది. ఈ సినిమా త‌ర్వాత వెంట‌నే నాని న‌టించే సినిమా ఏది? అంటే దానిపై నేచుర‌ల్ స్టార్ స్వ‌యంగా ఓ క్లారిటీ ఇచ్చేశారు.

నేడు హైద‌రాబాద్- అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో నాని `దేవ‌దాస్` చిత్రం గురించి మాట్లాడుతూ .. ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించారు. అస‌లు కింగ్‌ తో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం ఎలా ఉంది? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌రమైన ఆన్స‌ర్ ఇచ్చారు నాని. ``నేనేం ఇమేజ్ డ్రివెన్ ఆర్టిస్టును కాను. ఏదో క‌టౌట్ చూసి నా సినిమాల‌కు రారు. ఉద‌యాన్నే విజిల్స్ ని ఆస్వాధించాల‌ని కూడా ఎవ‌రూ అనుకోరు. జ‌నం సినిమాను సినిమాగా చూడ్డానికి వ‌స్తారు. అలా అనుకునే ఈ సినిమాను చేశాను. నాగ్ సార్ యాడ్ కావ‌డం సినిమాకి పెద్ద ప్ల‌స్ అయ్యింది`` అనీ అన్నారు.

త‌దుప‌రి జెర్సీ వివ‌రాలు చెబుతారా? అంటే.. విజ‌య‌ద‌శ‌మికి `జెర్సీ` షూటింగ్ ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. ఈ సినిమా కోసం ప్ర‌తిరోజూ మూడున్న‌ర గంట‌ల సేపు క్రికెట‌ర్‌ గా ట్రెయినింగ్ తీసుకుంటున్నాన‌ని నాని అన్నారు. ఈ చిత్రం నా కెరీర్‌లో అన్నీ కుదిరిన సినిమా. బ్యాట్స్‌ మ్యాన్‌ గా క‌నిపిస్తాను. కెరీర్‌ లో గుర్తుంచుకునే సినిమా అవుతుంది.. అన్నారు. వైజ‌యంతి బ్యాన‌ర్ అంటే సొంత బ్యాన‌ర్ అని - అశ్వ‌నిద‌త్ త‌న‌ని సొంత మ‌నిషిలా చూస్తార‌ని అన్నారు. దేవ‌దాస్ న‌వ్విచే సినిమానే కాదు, న‌వ్వుల‌తో పాటు ఏడిపించే సినిమా కూడా అని, ఎమోష‌న్ ఆక‌ట్టుకుంటుంద‌ని తెలిపారు.