Begin typing your search above and press return to search.

కోరి కోరి సల్మాన్ ను కాపీ చేశాడా?

By:  Tupaki Desk   |   18 Jun 2017 9:54 AM GMT
కోరి కోరి సల్మాన్ ను కాపీ చేశాడా?
X
యంగ్ హీరో నాని.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. నాని నటించిన మూవీకి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురుస్తోంది. భారీ సెట్స్ హంగామా ఉండాల్సిన అవసరం లేకపోవడం.. స్టార్ క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తుండడం.. నిర్మాతలకు కూడా మంచి లాభాలనే తెచ్చిస్తోంది. పైగా నాని అనే పేరు ఇప్పుడు ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. సబ్జెక్టులను ఎంచుకోవడంలోనే సగం హిట్ కొట్టేస్తున్నాడు ఈ న్యాచురల్ స్టార్.

నాని నటించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి. నివేదా థామస్ హీరోయిన్ గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కాగా.. ఈ ట్రైలర్ చూసిన జనాలు.. సల్మాన్ ఖాన్ మూవీ 'హమ్ దిల్ దే చుకే సనమ్' కు కాపీ అనేస్తున్నారు. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్- ఐశ్వర్యారాయ్ ప్రేమించుకోగా.. తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. అజయ్ దేవగన్ తో ఐశ్వర్యకు పెళ్లి కాగా.. ఆమె ప్రేమ గురించి తెలుసుకున్న అజయ్ దేవగన్.. ఐశ్వర్యారాయన్ ను సల్మాన్ తో కలిపేందుకు ఇటలీ అంతా వెతికేస్తాడు.

ఇప్పుడు నిన్ను కోరి ట్రైలర్ కూడా ఇలాగే కనిపిస్తోందన్నది జనాల మాట. నాని- నివేదలు ప్రేమించుకోగా.. తండ్రి ప్రేమను అంగీకరించడు. అమెరికాలో ఆది- నివేదాలు కలిసి ఉండే చోటకు నాని వెళ్లగా.. అక్కడి నుంచి ముగ్గురి మధ్య జరిగే కథే ఈ మూవీ అని ట్రైలర్ లో చెప్పారు. అయితే.. ఆది- నివేదలకు పెళ్లయిందా లేదా అనే విషయాన్ని ట్రైలర్ చూసి చెప్పడం కష్టం. హీరోనే వాళ్ల దగ్గరకు వెళ్లడం మినహాయిస్తే.. మిగిలిన కథ అంతా.. సల్మాన్ ఖాన్ సినిమానే అనేస్తున్నారు ఆన్ లైన్ జనాలు. మరి జనాలకు ఇంతకు మించిన థ్రిల్ నాని ఏమిస్తాడో తెలియాలంటే.. నిన్ను కోరి రిలీజ్ డేట్ అయిన జూలై 7వరకూ ఆగాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/