10 రోజుల్లో పాతిక.. నాని స్టామినా

Mon Jul 17 2017 21:49:07 GMT+0530 (IST)

నాని నటించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి విజయవంతంగా దూసుకుపోతోంది. మొదటివారం అంతా స్టడీగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో వీకెండ్ లో కూడా మంచి వసూళ్లనే సాధించగలిగింది. ఈ వారం రిలీజ్ లలో నాని స్పీడ్ కి బ్రేక్ వేయగల సినిమా ఏదీ లేకపోవడం.. బాగా కలిసొచ్చింది. స్ట్రాంగ్ మౌత్ టాక్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పచ్చు.

10 రోజులు ముగిసేసరికి నిన్ను కోరి మూవీ ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల గ్రాస్.. 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగలిగింది. నైజాంలో మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ఈ 10 రోజుల్లో 8.32 కోట్ల షేర్ ను సాధించింది. వైజాగ్ లో 2.81 కోట్లు.. ఈస్ట్ 1.65 కోట్లు.. వెస్ట్ 1.07 కోట్లు.. కృష్ణా 1.37 కోట్లు.. గుంటూరు 1.34 కోట్లు.. నెల్లూరు 0.55 కోట్లతో కోస్తా జిల్లాల నుంచి 8.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సీడెడ్ లో సాధించిన 2.44 కోట్లతో కలుపుకుంటే.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి 19.55 కోట్ల షేర్.. రూ. 32.9 కోట్ల  గ్రాస్ వచ్చాయి.

కర్నాటక నుంచి 1.61 కోట్లు కొల్లగొట్టిన నిన్ను కోరి.. యూఎస్ మార్కెట్ నుంచి 3.24 కోట్లను సాధించడం విశేషం. మిగిలిన ఏరియాల నుంచి వచ్చిన 0.85 కోట్లను కలిపితే.. మొత్తంగా 25.25 కోట్ల రూపాయల షేర్ ను న్యాచురల్ స్టార్ రాబట్టగలిగాడు. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఈ కలెక్షన్స్ తో నిన్ను కోరి సూపర్ హిట్ కేటగిరిలోకి చేరిపోయింది. కానీ ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే మాత్రం.. బ్లాక్ బస్టర్ జాబితాలోకి వెళ్లడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.