Begin typing your search above and press return to search.

జానీకి రీమేక్ గా నాగ్-నాని మల్టీస్టారర్

By:  Tupaki Desk   |   21 May 2018 7:28 AM GMT
జానీకి రీమేక్ గా నాగ్-నాని మల్టీస్టారర్
X
ఓ ఫారిన్ సినిమానో.. లేకపోతే మరేదైనా నచ్చిన కథా వస్తువునో ఇన్ స్పిరేషన్ తీసేసుకుని కథ తయారు చేసుకోవడం చాలా కాలం నుంచే జరుగుతోంది. అయితే.. గతంలో ఇలాంటి వాటిని చెప్పేవాళ్లు కాదు చాలామంది మేకర్స్. కానీ ఇప్పుడు ఇలాంటి పప్పులు ఉడకడం లేదు. జనాలు బాగా స్మార్ట్ అయిపోయారు. దీంతో ఎందుకొచ్చిన వివాదాలు అనుకున్న మేకర్స్ అసలు విషయాలను చెప్పేస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున- నాని ఓ మల్టీ స్టారర్ లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రీమేక్ అని తెలుస్తోంది. ఓ హిందీ సినిమాను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని మూవీ చేస్తున్నాడట దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ విషయం ముందుగానే హీరోలు ఇద్దరికీ కూడా తెలుసని అంటున్నారు. అయితే.. బాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందడంతో.. తమ మూవీ రీమేక్ అనే విషయాన్ని దాచిపెట్టేకంటే.. ముందుగానే చెప్పేయడం బెటర్ అని ఫిక్స్ అయ్యారట.

2007లో వచ్చిన బాలీవుడ్ మూవీ జానీ గద్దర్ కు రీమేక్ గానే.. నాగ్-నాని మల్టీస్టారర్ కథ సిద్ధమైందట. ఈ రీమేక్ అంశాన్ని త్వరలోనే పబ్లిక్ గా అనౌన్స్ మెంట్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యారట. నానికి జోడీగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. నాగార్జున-ఆకాంక్ష సింగ్ జంటగా యాక్ట్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.