Begin typing your search above and press return to search.

పూరి అండ్ నాని.. ఏంటి కథ?

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:25 PM GMT
పూరి అండ్ నాని.. ఏంటి కథ?
X
ఎంత ఫెయిల్యూర్ లు అందుకునప్పటికి పూరి జగన్నాథ్ ఒకప్పటి స్టార్ డైరెక్టర్. కెరీర్ లో ఆయనకు ఆ మధ్య ప్లాప్స్ వచ్చినట్టే ఈ మధ్య కూడా ఎక్కువగా వస్తున్నాయి. కెరీర్ ను మళ్లీ ఫామ్ లోకి తేవాలని చాలా ట్రై చేస్తున్నారు. ఇటీవల కొడుకు ఆకాష్ తో చేసిన మెహబూబా విజయం అందుకుంటుంది అనుకున్నప్పటికి పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. దీంతో పూరి తన అసలైన హీరో క్యారెక్టరైజేషన్ మసాల ఫార్మాట్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం న్యాచురల్ స్టార్ ని ఎంచుకున్నాడు. గతంలోనే వీరి మధ్య ఒక ప్రాజెక్ట్ ఒకే అయ్యింది. నాని బిజీగా ఉండడం వల్ల సెట్స్ పైకి రాలేదు. ఇంకా అధికారికంగా ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లు ఎనౌన్స్ మెంట్ రాలేదు గాని త్వరలోనే ఈ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. ఇటీవల పూరి నాని మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని కూడా కొంచెం డిజాస్టర్ లో ఉన్నాడు. కృష్ణార్జున యుద్ధం సినిమా దారుణమైన రిజల్ట్ ను అందించింది. అందుకే రొటీన్ కాస్త భిన్నంగా ట్రై చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ దర్శకత్వంలో జెర్సీ అనే సినిమా చేస్తున్న నాని అందులో ఒక క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందట.

అయితే పూరి సినిమాలో మాస్ హిరోగా పూరి స్టైల్ లో కనిపిస్తాడట. పూరి కూడా ఈ గ్యాప్ లో కొడుకు ఆకాశ్ తోనే మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఏదేమైనా కూడా.. పూరి అండ్ నాని అంటే కథ ఆసక్తికరంగానే ఉంది.