Begin typing your search above and press return to search.

రవితేజలా కాకుండా.. చైతన్యలా ఉంటే..

By:  Tupaki Desk   |   4 May 2016 5:30 PM GMT
రవితేజలా కాకుండా.. చైతన్యలా ఉంటే..
X
సినిమా ఇండస్ర్డీ మీదనే సినిమా వాళ్లు సినిమాలు తీస్తే.. అవన్నీ అంత గొప్పగా ఏనాడూ ఆడలేదు. నేనింతే.. ఒక విచిత్రమ్‌ వంటి సినిమాలన్నీ పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ర్టీ చుట్టూ తిరిగి.. బాక్సాఫీస్‌ దగ్గర ఫ్లాపైన సినిమాలు. హీరో రవితేజ ఎంతో బాగా నటించినా కూడా పూరి జగన్‌ తీసిన నేనింతే ఆడలేదు. అలాగే తేజ తీసిన ఒక విచిత్రమ్‌ కూడా అంతే. అయితే ఇక్కడ సినిమా ఫీల్డు చుట్టూ తిరిగే కథలు గెలవాలంటే ఒక ఫార్ములా ఉంది.

అప్పట్లో ఖడ్గం సినిమా తీసుకుంటే.. ఆ సినిమా అంతా దేశభక్తి అండ్‌ టెర్రరిజమ్‌ మీద సాగితే.. ఒక్క రవితేజ పాత్ర మాత్రం సినిమా ఫీల్డు చుట్టూ తిరుగుతుంది. కేవలం కొన్ని సీన్లు మాత్రమే తప్పిస్తే.. పెద్దగా ఫీల్డును చూపించిందేం లేదు. ఆ సినిమా రిజల్ట్‌ హిట్‌. ఆ తరువాత మొన్నామధ్యన వచ్చిన ఏమాయ చేశావే సినిమాలో కూడా నాగ చైతన్య అసిస్టెంట్‌ డైరక్టర్‌ అంటూ నటించాడు. కాని కొన్ని సీన్లలో మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉంటుంది.

ఇప్పుడిక ఈ కథంతా ఎందుకంటే.. త్వరలోనే నాని చేయబోయే విరించి వర్మ సినిమాలో అసిస్టెంట్‌ డైరక్టర్‌ గా నటించనున్నాడు. సో.. అభిమానులు ఏం కోరుకుంటున్నారంటే.. మనోడు రవితేజ టైపులో ఫుల్‌ లెంగ్త్ సినిమా రంగుతో సినిమాను నింపేయకుండా.. చక్కగా ఏమాయ చేశావే సినిమాలో నాగ చైతన్య టైపులో అక్కడక్కడ మాత్రమే సినిమా వాసన తగిలిస్తే బెటర్‌ అని సినిమా విశ్లేషకుల అభిప్రాయం. ఏమంటావ్‌ నాని?