Begin typing your search above and press return to search.

దసరా రేసులో న్యాచురల్ స్టార్ 'మజ్ను'

By:  Tupaki Desk   |   24 July 2016 10:01 AM GMT
దసరా రేసులో న్యాచురల్ స్టార్ మజ్ను
X
మొన్ననేగా ఫిబ్రవరిలో ''కృష్ణగాడి వీర ప్రేమగాధ'' సినిమాతో ఎటాక్ ఇచ్చిండు న్యాచురల్ స్టార్‌ నాని. ఆ సినిమాను ఇంకా జనాలు మర్చిపోక ముందే.. ''జెంటిల్మన్'' అంటూ మరోసారి బరిలోకి దిగాడు. ఇది కూడా మాంచి హిట్టే. చక్కగా రెండు హిట్లు కొట్టేశాడు అనుకుంటుంటే.. ఇప్పుడు హ్యాట్రిక్‌ కూడా కుర్రాడు సీన్ సెట్టు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అవును.. నాని జెంటిల్మన్ సినిమా రిలీజయ్యాక కూడా అస్సలు బ్రేక్ అనేదే తీసుకోలేదు. కాస్త గ్యాప్ కూడా తీసుకోకుండా ఏం చేస్తున్నాడబ్బా అంటే.. సిన్సియర్ గా విరించి వర్మ డైరక్షన్‌ లో రూపొందుతున్న సినిమాలో నటించేస్తున్నాడు. ఈ సినిమాకు ''మజ్నూ'' అనే టైటిల్‌ దాదాపు ఫిక్సయిపోయినట్లే. మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చెయ్యాలనే డెడ్ లైన్ తో ఇప్పుడు టీమంతా చాలా ఫాస్టుగా పనిచేస్తోందట. బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్నారట.

అసలు ఒకే ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్.. అందులోనూ రెండు సినిమాలూ హిట్టయ్యాక మూడో సినిమా.. వాటే ప్లానింగ్ సర్ జీ. చూస్తుంటే మరో హిట్టు కొట్టేశాలే ఉన్నాడే మన నాని.