Begin typing your search above and press return to search.

అక్కడ నాని బ్రాండ్ పనిచేయలేదే!!

By:  Tupaki Desk   |   27 Oct 2016 11:30 AM GMT
అక్కడ నాని బ్రాండ్ పనిచేయలేదే!!
X
హీరో నాని బ్రాండ్ అనేది ఓ రేంజులో డెవలప్ అయ్యింది. ముఖ్యంగా మనోడు ఓవర్సీస్ లో కూడా తిష్ట వేస్తున్నాడు అనే రిపోర్టులు ఫ్యాన్స్ అందరినీ చాలా ఎక్సయిట్మెంట్ కు గురిచేశాయి. కాకపోతే ఓవర్సీస్ అయినా ఇండియా అయినా లేక పశ్చిమ గోదావరిలో ఉన్న ఏలూరులోనైనా.. కేవలం బ్రాండ్ వాల్యూ అనేది తొలిరోజు జనాలను పిలువడానికే గాని.. ఆ తరువాత కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. ఇప్పుడు అదే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఈ మధ్య కాలంలో నాని సినిమాలన్నీ బాగానే ఉండటంతో.. ''మజ్నూ'' సినిమాను దాదాపు 2.7+ కోట్లకు అమెరికాలో రిలీజ్ చేసేందుకు ప్రధాన బయ్యర్ ఒకరు కొన్నారు. వారు తమ దగ్గర నుండి ఏరియాల వారీగా సినిమాను మొత్తం 3.2+ కోట్లకు అమ్మేశారు. ఇక సినిమాకు కేవలం 5 లక్షల డాలర్ల కలక్షన్ మాత్రమే వచ్చింది. అందులో ఖర్చులు తీసేసి షేర్ లెక్కకడితే.. ఓ 2 లక్షల డాలర్లు వస్తుంది అనుకోండి. అంటే కేవలం 1.4+ కోట్ల రూపాయల షేర్ మాత్రమే సినిమా వసూలు చేసిందనమాట. ఆ లెక్కన ఏ రేంజులో లాస్ వచ్చిందో ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దీనిబట్టి అర్దమైంది ఏంటంటే.. కేవలం బ్రాండ్ వాల్యూ ఒక్కటే ఉంటే సరిపోదు. సినిమాలో సింపుల్ కంటెంట్ తో వచ్చేసి.. బయట మాత్రం బాహుబలి అసిస్టెంట్ డైరక్టర్ అంటూ భారీగా ప్రచారం చేసేసి.. ఆ తరువాత సినిమాలో కేవలం ఒకే ఒక్క సీన్లో అసిస్టెంట్ అని చూపిస్తే.. ఎక్కడో కాస్త లాజిక్ అండ్ మ్యాజిక్ మిస్సయినట్లే అనిపించింది. అందుకే బ్రాండ్ వాల్యూ ఓవర్సీస్ లో వర్కవుట్ అవ్వలేదు మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/