Begin typing your search above and press return to search.

నాని మజ్ను పాఠాలు బాగున్నాయే

By:  Tupaki Desk   |   30 July 2016 7:55 AM GMT
నాని మజ్ను పాఠాలు బాగున్నాయే
X
జెంటిల్మన్ హిట్ ఊపులో ఉన్న నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా కంప్లీట్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. మజ్ను అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. తన ప్రతీ సినిమాకి ఫస్ట్ లుక్ తోనే ఆసక్తి తీసుకొచ్చే నాని.. మజ్ను విషయంలోను ఆ టెక్నిక్ ఫాలో అయిపోయాడు.

పాతకాలం నాటి గ్రామ్ ఫోన్ రికార్డ్.. పక్కనే ఓ సాఫ్ట్ టాయ్ డాగ్. దాని పక్కనే కూచుని.. చేతిలో బాటిల్ పట్టుకుని ఏదో చెబుతున్న నేచురల్ స్టార్. ఆ గ్రామ్ ఫోన్ చూడగానే.. అప్పట్లో హెచ్ఎంవీ లోగో గుర్తు రాక మానదు. ఈ పోస్టర్ లో నాని స్టైలింగ్ సూపర్ గా ఉంది. టీ షర్ట్ మీద.. ఓరి నీ వేసాలు అంటూ రాసి ఉన్న కార్టూన్. అన్ని యాంగిల్స్ లోను మజ్ను పోస్టర్ అదిరిపోయింది. ఒక్క పోస్టర్ తో ఎన్నెన్ని మాటలు చెప్పచ్చో అన్ని చెప్పాడు నాని.

'తాగడం మానేయడం.. ప్రేమించడం మొదలుపెట్టండి' అంటూ క్యాప్షన్ తో పాఠాలు కూడా చెబుతున్నాడు నాని. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. చాలా స్పీడ్ గా కంప్లీట్ అయిపోతోంది. దసరా నాటికి రేసులో నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. స్టార్ హీరోల సినిమాలు పోటీ ఉన్నా సరే.. నాని మజ్ను దసరాకే వస్తుందంటున్నారు.