కొంచెం తేడా కొట్టింది నాని!!

Wed Sep 19 2018 17:44:21 GMT+0530 (IST)

నాగార్జున నానిల కాంబోలో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న దేవదాస్ విడుదలకు పది రోజులు కూడా సమయం లేదు. ఇంకో వారంలో సినిమా రిలీజ్ అనంగా ఫంక్షన్ చేస్తున్నారు. దాని సంగతి అలా ఉంచితే మొదలు పెట్టడానికి ముందు చాలా క్రేజీ కాంబోగా అనిపించిన నాగ్ నానిల డ్యూయో ప్రమోషన్ మెటీరియల్ బయటకి వచ్చాక ఆ రేంజ్ లో కిక్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా నాని డాక్టర్ గా ఇందులో చూపించిన గెటప్ కానీ హెయిర్ స్టైల్ కానీ అంతగా సింక్ కాలేదనే కామెంట్స్ కొందరు అభిమానుల నుంచి కూడా వచ్చాయి. నాగార్జున మాత్రం ఎప్పటిలాగే రెగ్యులర్ గెటప్ లో హ్యాండ్ సంగా ఉండగా కొన్ని చోట్ల గ్లామర్ విషయంలో నానిని సైడ్ చేశాడన్న మాట కూడా నిజమే. అసలు నాని పాత్రను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఎలా డిజైన్ చేసుంటాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా నాని గత ఐదారు సినిమాల్లో చాలా స్టైలిష్ గా మాస్ టచ్ ఉన్న మేకోవర్ తో బాగా కనిపిస్తున్నాడు.కానీ దేవదాస్ విషయంలో మాత్రం అగ్రహీరో కాబట్టి నాగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నానిని ఇలా సెట్ చేసారా లేక స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నాని రాజీ పడ్డాడా అనేది విడుదలయ్యాక తెలుస్తుంది. నాని లుక్ గురించి ఇంత యావరేజ్ రెస్పాన్స్ రావడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. పైపెచ్చు బిగ్ బాస్ 2 యాంకర్ గానే నాని బాగున్నాడు. సింక్ అయినా కాకపోయినా కథలో విషయం ఉండి దేవదాస్ కనక బాగుంటే ఈ మైనస్ లు ఎవరూ పట్టించుకోరు కానీ తేడా వస్తే మాత్రం ఇవే హై లైట్ అవుతాయి. కృష్ణార్జున యుద్ధం కొట్టిన దెబ్బ నుంచి దేవదాస్ పూర్తిగా బయటపడేస్తుందని నాని చాలా నమ్మకంతో ఉన్నాడు. రష్మిక మందన్న నానికి జోడిగా నటించిన ఈ మూవీకి మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్ జనంలోకి బాగానే వెళ్లాయి.