Begin typing your search above and press return to search.

చరణ్ ఉండనీ.. మహేష్ రానీ.. నాని ఫిక్స్

By:  Tupaki Desk   |   24 Feb 2018 10:29 AM GMT
చరణ్ ఉండనీ.. మహేష్ రానీ.. నాని ఫిక్స్
X
మార్చి నెలాఖర్లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రామ్ చరణ్ సుకుమార్ ల ‘రంగస్థలం’. ఆ సినిమా సందడి రెండు వారాలైనా ఉంటుందని అంచనా. ఇక ఏప్రిల్ మూడో వారంలో మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను రంగంలోకి దిగబోతోంది. ఈ సినిమా మీదా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాల మధ్య వేరే సినిమాను రిలీజ్ చేయడమంటే సాహసమే. అయితే సూపర్ ఫాంలో ఉన్న నాని మాత్రం ఆ విషయంలో భయపడట్లేదు. ముందు ప్రకటించినట్లే ఏప్రిల్ రెండో వారంలో తన కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ను రిలీజ్ చేయడానికి అతను ఫిక్సయ్యాడు.

‘భరత్ అనే నేను’ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయిన రెండు రోజులకే ‘కృష్ణార్జున యుద్ధం’ డేట్ కూడా ఫిక్సయింది. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ఈ రోజు కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ యాడ్స్ కూడా ఇచ్చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ.. హిట్లు మీద హిట్లు కొడుతూ భీకర ఫాంలో ఉన్న నానితో చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు.. తొలి పాట ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఈ చిత్రంలో నాని.. కృష్ణ.. అర్జున్ అనే రెండు పూర్తి విరుద్ధమైన పాత్రలు చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్.. రుక్సార్ కథానాయికలుగా నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్నందిస్తున్నాడు.