Begin typing your search above and press return to search.

జెర్సీకి అంత సీన్ ఉందంటారా!

By:  Tupaki Desk   |   14 April 2019 7:21 AM GMT
జెర్సీకి అంత సీన్ ఉందంటారా!
X
ఎన్నడూ లేనిది నాని జెర్సీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే 20 సార్లు చూశాను అంత గొప్పగా వచ్చింది అని చెప్పుకోవడం చూస్తే ఆ నమ్మకానికి ముచ్చటేస్తున్నా మరోపక్క విడుదలయ్యాక ఇలా చెప్పుకుంటే బాగుంటుంది కదా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా దీని నిర్మాతలు చైనా విడుదలకు సైతం ప్లాన్ చేస్తున్నారట.

బరువైన ఎమోషన్స్ ఉన్న సినిమాలను చైనీయులు బాగా ఇష్టపడతానని అందుకే దంగల్ హిందీ మీడియం లాంటి సినిమాలు కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాయని తెలుసుకున్న జెర్సీ ప్రొడ్యూసర్స్ అంతకు మించిన సెంటిమెంట్ ఉన్న జెర్సీ ని చైనాకు తీసుకెళ్తే లాభాలు రెట్టింపు అవుతాయనే ఆలోచనతో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ నిజమే కాని చైనాలో సెంటిమెంట్ ఉన్న సినిమాలన్నీ వర్క్ అవుట్ అయిన దాఖలాలు లేవు

ఒకవేళ అదే నిజమైతే మన మాతృదేవోభవ లాంటివి ఇప్పుడు రిలీజ్ చేస్తే విపరీతమైన ఆదరణ దక్కాలి. అయితే అదంతా సులువు కాదు. చైనా ప్రేక్షకులు ఎమోషనల్ సినిమాలకు పట్టం కడతారు కాని వాళ్ళకు కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టు ఉంటేనే ఆడనిస్తారు. జెర్సీ ప్రధానంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.

అసలు చైనా వాళ్ళకు క్రికెట్ పిచ్చి లేదు. అందుకే ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరు తెచ్చుకునా ఇప్పటిదాకా చైనా క్రికెట్ లో ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించలేదు. మరి అలాంటప్పుడు ఎంత ఎమోషనల్ గా తీసినా జెర్సీ ఆడటం మీద అనుమానాలు కొట్టిపారేయలేం. అలా వర్క్ అవుట్ అవుతుంది అనుకుంటే ముందుగా అమీర్ ఖాన్ తన లగాన్ ని తీసి వదులుతాడుగా