Begin typing your search above and press return to search.

జెర్సీని చాలా తెలివిగా ముగించారే

By:  Tupaki Desk   |   21 April 2019 4:23 AM GMT
జెర్సీని చాలా తెలివిగా ముగించారే
X
నాని జెర్సీ విజయ పధంలో దూసుకుపోతోంది. ఏ రేంజ్ సక్సెసో తర్వాత తేలుతుంది కాని ఇప్పుడైతే న్యాచురల్ స్టార్ అభిమానుల ఆనందం మాములుగా లేదు. నిజానికి దీని విడుదలకు ముందే క్లైమాక్స్ గురించి రకరకాల ఊహగానాలు చెలరేగాయి. నెగటివ్ టచ్ తో ముగిస్తారని భీమిలి కబడ్డీ జట్టు తరహలో దీనికీ అలాంటి ముగింపు ప్లాన్ చేశారని టాక్ వచ్చింది. దీన్ని దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినా ప్రచారం మాత్రం జోరుగా సాగింది. దీని గురించి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూశారు.

మొత్తానికి అనుకున్నట్టే అయినా ఊహించని విధంగా మరో రూపంలో ఫినిషింగ్ ఇచ్చాడు గౌతం తిన్ననూరి. అది ఇక్కడ రివీల్ చేయడం భావ్యం కాదు కాబట్టి చెప్పడం లేదు. చాలా తెలివిగా స్క్రీన్ ప్లే ని రన్ చేస్తూ ఒకరకమైన సస్పెన్స్ ని కొనసాగిస్తూ నేరేట్ చేసిన విధానం బాగా కనెక్ట్ అయ్యింది .మొత్తానికి నాని ఇలాంటి పాత్రను ఒప్పుకుని కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు.

హీరో అంటే సినిమా మొత్తం ప్రేమ కథ నడుపుతూ ఉండాలనే ట్రెండ్ కు భిన్నంగా పదేళ్ళ కొడుక్కి తండ్రిగా ఎమోషన్స్ ని మోసిన తీరుకు బెస్ట్ యాక్టర్ గా ఎన్ని అవార్డులు వస్తాయో అని ఫాన్స్ ఇప్పటి నుంచే అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఇలాంటి కథలు క్లైమాక్స్ లు ఇమేజ్ ఉన్న హీరోలు ఒప్పుకోరు. పైగా మసాలాలు జోడించమని స్వంత తెలివి తేటలు చూపిస్తారు. కాని నాని గౌతంలు వీటికి దూరంగా చెప్పాలనుకున్న పాయింట్ కే కట్టుబడిన తీరుకు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తోంది