Begin typing your search above and press return to search.

జెంటిల్ మన్ ఎందుకు హిట్టవ్వాలి??

By:  Tupaki Desk   |   28 May 2016 5:30 PM GMT
జెంటిల్ మన్ ఎందుకు హిట్టవ్వాలి??
X
హీరో నాని లీడ్‌ రోల్‌ చేస్తున్న మూవీ.. ''జంటిల్ మన్''. ఈ సినిమాను గంటా నవీన్‌ బాబును తొలిసారిగా 'నాని' అని మార్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే ఇది రొటీన్‌ కమర్షియల్ సినిమా కాదంట. అనేక ట్విస్టులు.. అనేక కొత్త రకం క్యారెక్టర్లు.. అబ్బో అదో రకం అంటలే. కాస్త కొత్తరకంగా ఉండే ఈ సినిమా తప్పకుండా హిట్టవ్వాలి అంటున్నాడు నాని.

''ఈ సినిమా మూడు రీజన్ల కొరకు ఎవరైనా కూడా చూడాలి. ఒకటి. దర్శకుడు మోహన్‌ కృష్ణ కు ఆడియన్స్ ఆ అందని ద్రాక్ష వంటి హిట్టివ్వాలి. ఆయనకు మనం ఋణ పడ్డాం. రీజన్‌ 2. ఇటువంటి సినిమాలు హిట్టయితే.. ఖచ్చితంగా మన దగ్గర కొత్త కొత్త కథలు వస్తాయి. మూడో రీజన్‌ ఏంటంటే.. ఈ సినిమా చేయొద్దు అని నాకు చెప్పిన ఫిలింనగర్‌ వారందరికీ వారు తప్పు అని ప్రూవ్‌ చేయాలి'' అని చెప్పుకొచ్చాడు నాని. ఈ సినిమాలో మనోడు పాజిటివ్‌ రోల్‌ చేస్తున్నాడా నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నాడా అనే తేడా లేకుండా ప్రస్తుతం ట్రైలర్ తో కన్ఫ్యూజ్‌ చేస్తున్నాడు.

ఇప్పటికే భలే భలే మగాడివోయి సినిమాతో పెద్ద హిట్టు కొట్టాక.. కృష్ణగాడి వీర ప్రేమగాధతో కాస్త వెనుకబడ్డాడు.. మరి జెంటల్మన్‌ ఆ కోరికను తీరుస్తాడా?