నాని ఐఫోన్ రిటార్ట్ పేలిందిగా

Tue Jun 19 2018 13:03:02 GMT+0530 (IST)

బిగ్ బాస్ 2 హౌస్ లోనే కాదు బయట కూడా సంచలనాలకు వేదికగా మారుతోంది. ఫస్ట్ ఎలిమినేషన్ లో బయటికి వచ్చిన సంజనా దీనికి శ్రీకరం చుట్టేసింది. నిన్న రాత్రి నుంచే కొన్ని న్యూస్ ఛానల్స్ డిస్కషన్ పెట్టేసి తనను పంపడానికి గల కారణాలు కూడా లైవ్ లో  విశ్లేషించడం మొదలుపెట్టాయి. ఇక యు ట్యూబ్ ఛానల్స్ సంగతి చెప్పాల్సింది ఏముంది. సంజనా వీళ్ళ చర్చలు ఇంటర్వ్యూలలో బిజీ బిజీగా గడిపేస్తోంది. షో మీద నిర్వాహకుల మీద చేస్తున్న కామెంట్స్ తో పాటుగా నానిని  జూనియర్ ఎన్టీఆర్ తో కంపేర్ చేస్తూ అన్న మాటలు మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ధీటుగా చిన్న మాటలో నాని ఇచ్చిన కౌంటర్ అంతకు రెట్టింపు వెళుతోంది. విషయానికి వస్తే ఓ యు ట్యూబ్ ఛానల్ సంజనాను  నాని తారక్ లలో బిగ్ బాస్ యాంకరింగ్ ఎవరు బాగా చేసారు అన్న ప్రశ్నకు బదులిస్తూ అల్టిమేట్ గా జూనియర్ అని చెప్పేసింది. అక్కడితో ఆగినా సరిపోయేది. తన వ్యక్తిగత అభిప్రాయం అని సరిపుచ్చుకునేవాళ్ళు.కానీ సంజనా ఏకంగా ఐఫోన్ తో పోలిక పెట్టేసింది. ఒక్కసారి ఐ ఫోన్ వాడాక వేరేవి ఎలా అయితే నచ్చవో తనకూ అంతే అని ఖరీదైన ఐఫోన్ ని తారక్ తో అంత కంటే తక్కువ విలువున్న ఫోన్ ని నానితో  పోల్చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో నాని దాకా చేరిపోయింది. దానికి బదులిస్తూ నాని  నాకు కూడా ఐ ఫోన్ ఇష్టం అని బదులివ్వడంతో ఏదో కాటుకు ఏదో దెబ్బ సామెతలా బాగా పేలిందని ఫాన్స్ సంబరపడుతున్నారు. నిజానికి సంజనా తన పర్సనల్ ఒపీనియన్ చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఇలా ఐఫోన్ చైనా ఫోన్ అంటూ మీనింగ్ వచ్చేలా పోలికలు పెట్టడం మాత్రం అర్ధరహితం. ప్రేక్షకులైనా  నాని యాంకరింగ్ చూసింది ఇప్పటిదాకా  వీక్ ఎండ్ లో వచ్చిన  మూడు ఎపిసోడ్లే. వాటికే ఫస్ట్ సీజన్ మొత్తం పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చడం కరెక్ట్ కాదు. సంజనా ఇప్పుడు బయటికి వచ్చేసింది కాబట్టి ఏమన్నా చెల్లిపోతుందని కాదు కానీ నాని ఇచ్చిన ఆన్సర్ మాత్రం భలే పేలింది. అయినా మారుతున్న టెక్నాలజీలో ఫోన్ అంటే ఒక్క ఐ ఫోన్ అనుకుంటే ఎలా. దానికి ధీటైన ప్రత్యాన్మాయాలు  చాలానే ఉన్నాయి. ఏదేమైనా సంజనా చేసిన కామెంట్ కి నాని ఇచ్చిన పంచ్ బాగా కొట్టేసింది.