పూరి తో నాని.. రూమరేనా?

Tue Jun 19 2018 17:17:04 GMT+0530 (IST)

చూస్తుంటే గత రెండేళ్లుగా పూరి జగన్నాధ్ టైం అసలు బావున్నట్టు లేదు. చేస్తున్న ఒక్క సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. వరుస ఫ్లాపులతో స్టార్ హీరోలు కూడా పూరితో సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు. చేసేదేం లేక కొడుకును లాంచ్ చేస్తూ మెహబూబా అనే సినిమా తీసాడు. కానీ అది కూడా హిట్ అవలేదు. ఇప్పుడు పూరి తదుపరి సినిమాపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి.మెహబూబా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ తన కొడుకు ఆకాష్ తోనే ఇంకో సినిమా తీస్తున్నట్టు చెప్పాడు పూరి. ఈమధ్యనే వచ్చిన రూమర్ ఏంటంటే పూరి నాచురల్ స్టార్ నానికి ఒక స్క్రిప్ట్ వినిపించాడట. ఆ కథ బీభత్సంగా నచ్చేయడంతో వెంటనే ఒకే చెప్పేశాడని టాక్ ఉంది. కాకపోతే గతంలో కూడా శర్వానంద్ - సందీప్ కిషన్ లాంటి హీరోలతో పూరి సినిమా చేస్తున్నట్టు మాటలు వినిపించాయి కానీ ఏవి నిజం అవ్వలేదు. అందుకే ఈ విషయమై నాని ని ఆరా తియ్యగా అలాంటిదేమి లేదని పూరి తో సినిమా కేవలం రూమరే అనే కొట్టి పారేశాడు.

ప్రస్తుతం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో ఒక సినిమా చేస్తున్నాడు నాని. అటు బిగ్ బాస్ 2 తో కుడా బిజీ గా ఉన్నాడు. జెర్సీ అనే సినిమా కూడా సైన్ చేశాడు. కాబట్టి పూరి తరువాత చిత్రం కూడా తన కొడుకు ఆకాష్ తోనే. ఈలోపు స్టార్ హీరోలు ఎవరైనా సినిమాకి ఒప్పుకున్నా ఆకాష్ తో సినిమా ఒక కొలిక్కి రాగానే ఆ సినిమాపై ఫోకస్ పెడతాడట.