పోస్టర్ టాక్: నాని మెగా లుక్

Thu Aug 22 2019 13:56:40 GMT+0530 (IST)

వచ్చే నెల 13న విడుదల కానున్న నాని గ్యాంగ్ లీడర్ ఇవాళ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. గ్యాస్ కట్టర్ ని చేతిలో పట్టుకుని బ్లాక్ గాగుల్స్ తో అచ్చం 1991లో వచ్చిన చిరంజీవి గ్యాంగ్ లీడర్ లోని లుక్ ని రీ క్రియేట్  చేసే ప్రయత్నం చేసిన టీమ్ దానికి తగ్గట్టే అంచనాలు నిలబెట్టుకుంది. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా ఫీలయ్యే ఈ సీన్ సినిమాలో కీలకమైన సందర్భంలో వస్తుంది. అన్నయ్యను హత్య చేసిన సంఘటన తాలూకు ఫోటోలు ఒక లాకర్ లో ఉన్నాయని తెలుసుకున్న చిరు ఆ ఐరన్ డోర్ ని బ్రేక్ చేయడం కోసం ఇలా లుక్ ఇస్తాడు.అచ్చం అదే తరహాలో కనిపిస్తున్న ఈ సీన్ లో నాని దేని కోసం గ్యాస్ కట్టర్ ని ఉపయోగించాడో సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. ఇప్పటికే టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కగా రిలీజైన ఆడియో సింగల్స్ కూడా మ్యూజిక్ లవర్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ రిలీజ్ చేయడం బాగానే ఉంది కానీ ఆ టైటిల్ వాడుకున్నందుకు ఇప్పటికే కాస్త గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్ ని చల్లార్చాలంటే కంటెంట్ పరంగా కూడా అదే స్టాండర్డ్ ఉండాలి.

అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఐదుగురు మహిళలకు అండగా నిలిచే ఓ క్రైమ్ రైటర్ రివెంజ్  డ్రామా చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్. జెర్సీ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న నాని ఇది కూడా దాన్ని మించిన సక్సెస్ అందుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాడు. టిపికల్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే విక్రమ్ కుమార్ దీన్ని కూడా తనదైన శైలిలో తీర్చిదిద్దిన్నట్టు ఇన్ సైడ్ టాక్