Begin typing your search above and press return to search.

లీడర్ ఎందుకు స్లో అయ్యాడు?

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:57 AM GMT
లీడర్ ఎందుకు స్లో అయ్యాడు?
X
చెప్పుకోదగ్గ అంచనాలతో మొన్న శుక్రవారం వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ ఊహించినట్టే మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. పోటీగా వస్తుందనుకున్న వాల్మీకి డ్రాప్ కావడం న్యాచురల్ స్టార్ కు కలిసి వచ్చింది. మొదటి నాలుగు రోజులకే పన్నెండు కోట్ల దాకా వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ టాక్. కానీ అనూహ్యంగా వీక్ డేస్ లో గ్యాంగ్ లీడర్ బాగా నెమ్మదించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఈవెనింగ్ షోస్ కి సైతం పెద్దగా ఆక్యుపెన్సీ లేదని తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాకు రివ్యూస్ రిపోర్ట్స్ కాస్త మిక్స్ డ్ గానే వచ్చాయి. పబ్లిక్ టాక్ సైతం యునానిమస్ గా ఏమి లేదు. కాకపోతే డీసెంట్ ఎంటర్ టైనర్ అనే పేరు తెచ్చుకోవడంతో ఫామిలీ ఆడియన్స్ అండతో గట్టెక్కవచ్చు అనే లెక్క తప్పినట్టు కనిపిస్తోంది. రివెంజ్ డ్రామాగా దర్శకుడు విక్రమ్ కుమార్ తీర్చిదిద్దిన తీరు అన్ని వర్గాలను మెప్పించలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఒకవేళ ఈ వీకెండ్ లో ఏమైనా పికప్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే అదంతా ఈజీగా కనిపించడం లేదు. వరుణ్ తేజ్ వాల్మీకితో పాటు సూర్య బందోబస్త్ లు బాలీవుడ్ నుంచి ఓ రెండు క్రేజీ సినిమాలు రేస్ లో ఉన్నాయి. వాటికి మరీ బ్యాడ్ టాక్ వస్తే అప్పుడు ఛాన్స్ ఉంది.

కానీ అదేంటో నానికి టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ అవ్వగానే కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం పరిపాటిగా మారింది. జెర్సికి సైతం మీడియా నుంచి బ్రహ్మాండమైన మద్దతు దక్కినా వసూళ్ల పరంగా అద్భుతాలు చేయలేకపోయింది. గ్యాంగ్ లీడర్ వరస కూడా అలాగే ఉంది. ప్రీ రిలీజ్ కు ముందున్న హైప్ ని నాని సినిమాలు కంటెంట్ పరంగా నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితి ఒకరకంగా నాని పడాల్సిన జాగ్రత్తను చూపుతున్నట్టే ఉంది.