Begin typing your search above and press return to search.

మందు కొట్టి షూటింగ్ కి వచ్చిన నాని

By:  Tupaki Desk   |   17 July 2017 10:22 AM GMT
మందు కొట్టి షూటింగ్ కి వచ్చిన నాని
X
సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి బోలెడన్ని అలవాట్లు ఉంటాయని జనాల ఫీలింగ్. ప్రస్తుతం బాగా సంచలనం అవుతున్న డ్రగ్స్ ఉదంతం కారణంగా.. ఇలాంటి ఫీలింగ్స్ మరింతగా పెరిగిపోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. కొంతమంది పేర్లు మాత్రం ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాయి. ఇలాంటి వారిలో హీరో నాని కూడా ఒకడు.

రీసెంట్ గా ఓ ట్వీట్ విషయంలో ఫ్యాన్ తో చిన్నపాటి వివాదం మినహా.. ఎప్పుడూ ఎక్కడా న్యాచురల్ స్టార్ పేరు వినిపించిన దాఖలాలు లేవు. కానీ ఏకంగా మందు కొట్టి నాని షూటింగ్ స్పాట్ కు వచ్చాడని.. అలాగే పూర్తిగా మత్తులోనే షూటింగ్ చేశాడనే వార్త సంచలనం అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా రైటర్ అయిన కోన వెంకట్ చెప్పడం విశేషం. నిన్ను కోరి షూటింగ్ లో భాగంగా ఓ సారి నాని ఇలా ఫుల్లుగా మందు కొట్టి షూటింగ్ చేశాడట. ఓ సీన్ షూట్ కోసం నాని ఫుల్ బాటిల్ తాగేసి మరీ షూటింగ్ చేశాడని చెప్పాడు కోన వెంకట్.

అమెరికాలో షూటింగ్ చేస్తున్న సమయంలో.. ఓ ప్రదేశంలో 0డిగ్రీల టెంపరేచ్ ఉందని చెప్పిన ఈ రైటర్.. ఆ సీన్ పండించడం కోసం ఫుల్లుగా తాగాడని చెప్పడం విశేషం. ఆ సీన్ ఎంతో న్యాచరుల్ గా రావడానికి.. నిజంగా తాగేయడమే కారణమట. నాని నిజంగా న్యాచురల్ స్టార్ అని పొగిడేస్తున్నాడు కోన.