నాని సినిమాలో అనుష్క? ఇంట్రెస్టింగ్!

Sun Jul 15 2018 22:24:14 GMT+0530 (IST)

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే తదుపరి సినిమా ఎప్పుడు ఖరారవుతుందో... ఎప్పుడు ఆ సినిమా వివరాలు బయటికొస్తాయో తెలియదు కానీ - ఆ సినిమా గురించి తరచుగా  ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఆయన సినిమా చేయడమనేది మాత్రం ఖాయం. అయితే ఎవరితో అన్నది మాత్రం ఇంకా ఇప్పటిదాకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయనైతే యువ కథానాయకుల్ని దృష్టిలో ఉంచుకొని కథ సిద్ధం చేసుకొన్నాడట. అయితే ఒకసారి నితిన్ తో ఆ సినిమా ఉంటుందన్నారు. అంతలోనే  కాదు కాదు నానితో అని పుకార్లొచ్చాయి.తాజా సమాచారం మేరకు దాదాపుగా నానితోనే ఆ సినిమా అని తెలుస్తోంది. అటు ఏలేటికీ - ఇటు నానికీ  మైత్రీ సంస్థ  ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చింది. ఆ రకంగా  నాని - ఏలేటి కాంబినేషన్ సెట్టవ్వడమనేదే ఒక ఆసక్తికరమైన విషయమైతే  ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.  నాని సినిమాలో అనుష్క కూడా కీలక పాత్ర పోషించబోతోందనేదే ఆ కొత్త కబురు. ఇది మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. అయితే  పరిశ్రమలో కొద్దిమంది ఏలేటి తయారు చేసిన కథ అనుష్క కోసమే అని అందులో నాని ఓ కీలక పాత్రలోకనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని అలాంటి సినిమా చేసే అవకాశమే లేదనీ నాని కథానాయకుడిగానే  కనిపించబోతున్నాడని మరికొంతమంది చెబుతున్నారు.  అసలు విషయం ఏంటనేది మరికొన్నాళ్లు ఆగితే బయటికొస్తుంది కానీ.. ప్రస్తుతానికి ఈ కాంబో మాత్రం సినీ ప్రేక్షకుల్లో  కావల్సినంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.