Begin typing your search above and press return to search.

ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో తెలిసింది

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:30 AM GMT
ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో తెలిసింది
X
ఫెయిల్యూర్ తర్వాత ఎదురయ్యే పరిస్థితి, ఒత్తిడి కంటే విజయం తర్వాత వచ్చే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అదే రెండు సక్సెస్ లు వరుసగా సాధించాక.. అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటాయి. అలాంటప్పుడు మరింత ఒత్తిడిని భరించాల్సి వస్తుంది. కానీ నాకు అలాంటి బాధ ఏం లేదంటున్నాడు నేచురల్ స్టార్ నాని. గతేడాది ఎవడే సుబ్రమణ్యం హిట్ కావడం, భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ కావడంతో.. నాని ఒక్కసారిగా టాప్ రేంజ్ హీరో అయిపోయాడు.

మరి ఇలాంటి సమయంలో వస్తున్న కృష్ణగాడి వీర ప్రేమగాథ హిట్ కావాలనే ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ తనపై తనకు ఉన్న నమ్మకం కంటే.. స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతో.. విజయం గురించి ఎలాంటి ఒత్తిడి లేదని చెబుతున్నాడు నాని. ‘నేను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కవుట్ కాదనే విషయం నాకు అర్ధమైంది. అలాంటి సినిమాలను నానుంచి ప్రేక్షకులు ఆశించడం లేదు. స్క్రిప్ట్ ప్రకారం పూర్తి ఎంటర్ టెయిన్ మెంట్ ఉండాలని ఆడియన్స్ నా నుంచి కోరుకుంటున్నారు.’ ఇప్పుడు నేను ఇదే విషయంపై పూర్తిగా దృష్టి పెట్టాను అంటున్నాడు నాని.

ఈ స్టోరీని హను రాఘవపూడి చెప్పినపుడే నమ్మకం కుదిరింది. ఈ స్క్రిప్ట్ కు ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టే సత్తా ఉంది. అందుకే నాకు విజయంపై ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పాడు. తాను పబ్లిసిటీలో పాల్గొనడం లేదన్న విమర్శలను ఖండించాడు నేచురల్ స్టార్. అంతే కాదు.. ఇప్పటివరకూ సక్సెస్ సాధించడంపై తాను చేసిన ఏ సినిమాపైనా లేని నమ్మకం.. కృష్ణగాడి వీర ప్రేమగాధపై ఉందన్నాడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 12 ప్రేక్షకుల ముందుదు రానుంది. ప్రస్తుతం తనను అష్టాచమ్మాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు నాని.