Begin typing your search above and press return to search.

మహేష్, చెర్రీలకు పోటీ ఇస్తున్న నాని

By:  Tupaki Desk   |   27 Nov 2015 3:30 PM GMT
మహేష్, చెర్రీలకు పోటీ ఇస్తున్న నాని
X
హీరో నాని ఇప్పుడు నేచురల్ స్టార్ అయిపోయాడు. ఏదో బిరుదు ఇవ్వడానికి స్టార్ అన్నారని అనుకున్నారు కానీ, ఇప్పుడు నిజంగానే నాని స్టార్ హీరో అయిపోయాడు. సరైన హిట్ ఒక్కటి పడితే స్టార్ అవడం ఖాయమంటూ.. ఈ మధ్యనే మహేష్ బాబు ఓ కామెంట్ చేశాడు. అది సుధీర్ బాబు గురించి అయినా.. ఇక్కడ నాని మాత్రం నిజంగానే ఆ ఒక్క హిట్ తోటి స్టార్ హీరోగా అవతరించేశాడు.

నానికి ఇంత రేంజ్ తెచ్చి పెట్టిన మూవీ భలేభలే మగాడివోయ్. ఈమూవీకి ఇప్పుడు ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చాయి. అక్షరాలా యాభై కోట్ల రూపాయల గ్రాస్, ఇరవై ఏడు కోట్ల పదకొండు లక్షల గ్రాస్ సాధించేశాడు నాని. దీనికి శాటిలైట్, రీమేక్ రైట్స్ గట్రా కూడా కలుపుకుంటే 35 దాటిపోతుంది. టాలీవుడ్ హీరోల్లో 35 కోట్లంటే చిన్న మాట కాదు. అతి తక్కువమందికి మాత్రమే ఈ రేంజ్ ఉంది. సినిమా ఫట్ అయినా 40 కోట్లు రాబట్టగల స్టార్ డమ్ ఉన్న హీరోలు మహేష్ - రామ్ చరణ్ లు. మిగిలిన వాళ్ల మూవీస్ హిట్ టాక్ వస్తేనే 40 వస్తున్నాయి. మరి నాని కూడా 35 దరిదాపుల్లోకి వచ్చేశాడు. ఇంకో మంచి హిట్ కానీ పడిందంటే.. ఆ ఐదు కూడా కవర్ చేసేయడం ఖాయమే. ఎందుకంటే.. నానికి క్లాస్ - మాస్ జనాల్లో ఫుల్లు ఫాలోయింగ్ ఉంది.

ముఖ్యంగా తన యాక్టింగ్ తో ఎవరినైనా ఆకట్టుకోగల కేపబులిటి ఉన్న యాక్టర్. ఇతగాడికి ఉన్న యూనివర్సల్ అప్పీల్ దీనికి అదనపు అడ్వాంటేజ్. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఇప్పటివరకూ సరైన మూవీ లేక చిన్న హీరోగా మిగిలిపోయాడు నాని. ఇప్పుడు ఈ రేంజ్, అంటే.. పెట్టుబడితో పోల్చుకుంటే.. ఈ ఏడాదికి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించడంతో.. నాని రేంజ్ మారిపోయింది. దీన్ని నిలబెట్టుకోవడం మాత్రం అంత తేలికైన విషయం కాదు లెండి.