టీ ఫలితాలపై నాని కామెంట్

Tue Dec 11 2018 19:14:22 GMT+0530 (IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులను తెలుగు సినీ ప్రముఖుల ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ పార్టీకి - కేసీఆర్ మరియు కేటీఆర్ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీఆర్ ఎస్ గెలుపుపై సహజ నటుడు నాని కూడా స్పందించాడు. నాని తనదైన శైలిలో టీఆర్ ఎస్ గెలుపుపై స్పందించి అందరి దృష్టిని ఆకర్షించాడు.నాని ట్విట్టర్ లో... తెలంగాణ ప్రజలు రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. ఇక వారి నమ్మకంను మీరు నిలబెట్టాలి. తెలంగాణ ప్రజలు పూర్తి నమ్మకంతో మళ్లీ మిమ్ములను గెలిపించారు. మీరు వారికి అభివృద్ది ఫలాలను అందిస్తారనే నమ్మకం ఉంది. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ - కేటీఆర్ మరియు టీఆర్ ఎస్ ఇతర పార్టీ నాయకత్వంకు కూడా నాని శుభాకాంక్షలు తెలిపాడు.

ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా టీఆర్ ఎస్ గెలుపుపై స్పందిస్తున్నారు. ఎన్నికల సమయంలో పెద్దగా నోరు మెదపని సినీ స్టార్స్ ఇప్పుడు గెలిచిన పార్టీకి జై కొడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.