Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ని చూస్తే నానికి అలా..

By:  Tupaki Desk   |   25 Sep 2016 9:30 AM GMT
ఆ హీరోయిన్ ని చూస్తే నానికి అలా..
X
సహజ నటుడు అనే ట్యాగ్ నుంచి నేచురల్ స్టార్ గా ఎదిగిపోయాడు నాని. ఈ జర్నీలో నాని ఇంతగా ఎదగడంలో.. ట్యాలెంట్ తో పాటు ఇతగాడి బిహేవియర్ కూడా చాలా ముఖ్యమైనది. డ్రెసింగ్ నుంచి ఏ విషయంలో కూడా ఆర్భాటం చూపించకుండా.. సింపుల్ గా ఉండేందుకు ట్రై చేస్తుంటాడు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో నాని ప్రవర్తన చాలామందిని ఇన్ స్పైర్ చేస్తుంది కూడా.

అందరి విషయంలో మంచోడిగానే ఉంటున్న నాని.. రాశి ఖన్నా దగ్గర మాత్రం నోరు జారుతున్నాడు. రీసెంట్ గా ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హైపర్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన నాని.. తన స్టైల్ లో కాకుండా ఒకింత నోరు జారి రాశి పై కామెంట్స్ చేశాడు. 'రాశీ.. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావ్. బ్యూటిఫుల్ అనే మాట అది నీట్ గా ఉంటుందని వాడాను. ఇక్కడ అందరికీ నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో చూస్తున్నారు' అనేశాడు నాని. గతంలో సుప్రీమ్ ఆడియో ఫంక్షన్ టైమ్ లో కూడా.. రాశి ఖన్నా నడుమును చూసి విజిల్స్ వేసేద్దామని అనుకున్నట్లు చెప్పాడు నాని.

మరి ఈ హీరోయిన్ ని చూస్తే.. నాని ఇంతగా రెచ్చిపోయి ఇందుకు కామెంట్స్ చేస్తున్నాడా అనుకుంటున్నారు చాలామంది.