Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నాని గారు వచ్చేశారు

By:  Tupaki Desk   |   18 May 2018 3:58 PM GMT
బిగ్ బాస్ నాని గారు వచ్చేశారు
X
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ షో తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చుతుంది అని ఎవరు ఊహించి ఉండరు. తీసే పద్దతిలో తీస్తే ఏదైనా నచ్చుతుంది అని బుల్లి తెర అభిమానులు ఈ షో ద్వారా నిరూపించారు. చాలా వరకు మొదటి షోకి అందిన రెస్పాన్స్ ఇతర ఇండస్ట్రీలో వారిని కూడా షాక్ కి గురి చేసింది. ఇక నెక్స్ట్ కూడా అంత కంటే ఎక్కువ రేంజ్ లో తెలుగు ప్రజలకు బిగ్ బాస్ కిక్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.

మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ తన బుజంపై బిగ్ బాస్ ను మోశాడు. ఇక ఆ బాధ్యతలను ఈ సీజన్ కు నాని తీసుకున్నాడు. రెగ్యులర్ సినిమాలను కాస్త పక్కనపెట్టి నాని చేస్తున్న ఈ ప్రయోగం పై అంచనాలు ఏ విధంగా పెరిగాయా స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే షో నిర్వాహకులు ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మంచి లుక్ ని రిలీజ్ చేశారు. గరం గరం చాయ్ ముందు పెట్టుకొని నాని స్టైల్ గా వంగి స్మైల్ తో ఇచ్చిన స్టిల్ సరికొత్తగా ఉంది.

సీజన్ 2 నానితో స్టార్ట్ అవ్వనుందని తెలుసుకున్న ఆడియెన్స్ సంఖ్య ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నాని అనుకున్నంత రేంజ్ లో మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం షోలో కంటెస్టెంట్ లు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రోమోలు కూడా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి