Begin typing your search above and press return to search.

ఈ సారి మసాలా ఎక్కువట

By:  Tupaki Desk   |   19 May 2018 7:22 AM GMT
ఈ సారి మసాలా ఎక్కువట
X
సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరైనా సరే ఒక దానిపై అంచనాలు పెరిగాయి అంటే నెక్స్ట్ దాని డోస్ పెంచేలా చూస్తారు. ముఖ్యంగా రియాలిటీ షోల విషయంలో గత కొంత కాలంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ కే బుల్లితెర ఆడియెన్స్ పల్స్ తెలుసుకున్న నిర్వాహకులు ఈ సారి మసాలా ఎక్కువయ్యేలా చేసుకుంటున్నారని టాక్ వస్తోంది. అంటే ఏ తరహాలో డోస్ పెంచుతారు అనేది చూడాలి.

రీసెంట్ గా రిలీజ్ చేసిన బిగ్ బాస్ ప్రోమోలో నాని 'బాబాయ్ ఇంకొంచెం మసాలా' అంటూ చెప్పడం ఆసక్తిని రేపుతోంది. మొదటి సీజన్ లో ఎన్టీఆర్ తోనే షో మొత్తం నడిచింది. పెద్దగా ఎట్రాక్ట్ చేసిన కంటెస్టెంట్స్ లేరు. కానీ నాని హోస్టింగ్ లో రాబోతోన్న ఈ సీజన్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. కాని మసాలా గట్టిగా తగిలిస్తే చివరకు మనోభావాలు దెబ్బ తిన్నాయి అనే కామెంట్స్ వస్తాయి. ఓ విధంగా షోకి అది ప్లస్ పాయింటే.

కాంట్రవర్షియల్ అయితే కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి అందులో బయపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రోమోకి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు ప్రమోషన్స్ పెంచే పనిలో పడ్డారు. హాట్ బ్యూటీలను పెట్టి గ్లామర్ టచ్ ఇస్తారా లేకా వివాదాలను సృష్టించే వారిని సెట్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.